‘సలార్’ శృతిహాసన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమా సలార్. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా ఇదే కావడంతో.. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవ్వగా… ప్రస్తుతం రామగుండంలోని బొగ్గుగనిలో పలు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దీని కోసం ఒక ప్రత్యేక సెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌లో ప్రభాస్ పాల్గొన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

SHRUTHIHASAN REMUNARATION FOR SALAAR

అయితే ఈ సినిమాలో శృతిహాసన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నట్లు ఇటీవల ఆమె బర్త్ డే సందర్భంగా సలార్ సినిమా యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా కోసం శృతిహాసన్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందనేది హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం శృతిహాసన్ రూ. కోటి రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.