విజయదశమి సందర్భంగా ‘హలో జాను’ చిత్ర షూటింగ్ ప్రారంభం!!

మనోజ్ గోపాల్ కృష్ణ, శ్రీ ఇందు హీరోహీరోయిన్లుగా ఎస్. ఎమ్. క్రియేషన్స్ మరియు సుముధ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘హలో జాను’. ‘సంఘ సంస్కర్త భగవత్ రామానుజాచార్యులు’, ‘మనం మారాలి’, ‘చిన్నిగుండెల్లో ఎన్ని ఆశలో’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మంజుల సరోజు ఈ చిత్రానికి దర్శకురాలు. విజయదశమి కానుకగా ఈ చిత్ర షూటింగ్‌ని చిత్రయూనిట్ ప్రారంభించింది. సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ఈ సందర్భంగా దర్శకురాలు మంజుల సరోజు మాట్లాడుతూ.. ‘‘హలో జాను చిత్ర షూటింగ్‌ని దసరా సందర్భంగా అక్టోబర్ 15 నుండి స్టార్ట్ చేస్తున్నాము. సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీకరణను పూర్తి చేయనున్నాం. రొమాన్స్ అండ్ కామెడీతో ప్రేక్షకులకు కనువిందు చేసేలా ఈ సినిమా ఉంటుంది. మనోజ్ గోపాల్ కృష్ణ, శ్రీ ఇందుతో పాటు మరో ప్రముఖ హీరోయిన్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. మురళీ ధర్మపురితో పాటు సుద్దాల అశోక్ తేజగారు అందించిన అద్భుతమైన సాహిత్యం, యూవీ నిరంజన్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఎస్.ఎమ్ క్రియేషన్స్, సుముధ క్రియేషన్స్ సంయుక్తంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని చిత్రీకరించేందుకు సపోర్ట్ అందిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేయనున్నాం’’ అని తెలిపారు.

హీరో మనోజ్ గోపాల్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘నేను తెలుగువాడినే. బెంగుళూరులో ఉంటాను. కొన్ని కన్నడ సినిమాలలో నటించాను. ఇప్పుడు తెలుగులో ‘హలో జాను’ చిత్రంతో హీరోగా డెబ్యూ ఇస్తున్నాను. నేను హీరోగా మారడానికి, ఈ వృత్తిని ఎన్నుకోవడానికి స్పూర్తి పవన్ కల్యాణ్‌గారు. ఆయన స్టైల్, యాటిడ్యూట్ వంటివన్నీ చూశాక నేను కూడా నటుడిని అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఆయనకు పెద్ద అభిమానిని. ఈ సినిమాకు సంబంధించి ఓ లిరికల్ సాంగ్‌ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేయడం జరిగింది. అది పవన్ కల్యాణ్‌గారి దగ్గరకు వెళుతుందని ఆశిస్తున్నాను. అలాగే ప్రేక్షకులు కూడా ఈ సాంగ్ చూసి ఆశీర్వదించాలని కోరుతున్నాను. ‘హలో జాను’ లవ్ అండ్ రొమాంటిక్ ఫిల్మ్. ఎస్.ఎమ్ క్రియేషన్స్, సుముధ క్రియేషన్స్ నిర్మాతలు, దర్శకురాలు మంజుల సురోజుగారు నాకు మంచి అవకాశం ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. దసరా కానుకగా ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అవుతున్నందుకు సంతోషంగా ఉంది..’’ అని అన్నారు.

మనోజ్ గోపాల్ కృష్ణ, శ్రీ ఇందుతో పాటు మరో ప్రముఖ హీరోయిన్ ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి
సంగీతం: యూవీ నిరంజన్
పాటలు: మురళీ ధర్మపురి, సుద్దాల అశోక్ తేజ
కెమెరా: వేణుఆర్మ్స్
నిర్మాణం: ఎస్.ఎమ్ క్రియేషన్స్, సుముధ క్రియేషన్స్
దర్శకత్వం: మంజుల సురోజు