ఓటీటీలపై నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు

లాక్‌డౌన్ వల్ల థియేటర్లు మూతపడటంతో.. చాలా సినిమాలు ఓటీటీలలో విడుదల అయ్యాయి. ప్రజలందరూ కూడా ఓటీటీల బాట పట్టారు. పెద్ద హీరోల సినిమాలు కూడా ఓటీటీలో విడుదలయ్యాయి. ఓటీటీలలో విడుదలైన సినిమాల్లో కొన్ని సినిమాలు సక్సెస్ అవ్వగా.. మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం కొన్ని సినిమాలు థియేటర్లలో విడులైన కొద్దిరోజులకే ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీంతో థియేటర్లకు వెళ్లి చూడలేని వారు ఓటీటీలో చూస్తున్నారు.

SURVEY ON OTT

ఈ క్రమంలో ఓటీటీలపై నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇండియాలో 50 కోట్ల మందికి స్మార్ట్‌ఫోన్స్ ఉంటే.. అందులో 35.5 కోట్ల మంది ఓటీటీలను వీక్షిస్తున్నారని ఫిక్కీ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇందులో 60 శాతం మంది 18-35 ఏళ్లలోపు వారు ఉన్నారట. ఓటీటీల ఆదాయం 2017లో 2019 కోట్లు ఉంటే.. 2020 డిసెంబర్ నాటికి 4500 కోట్లకు పెరిగిందట.