Rajasheker: ఓ త‌మిళ సినిమాల్లో రాజ‌శేఖ‌ర్ కూతురు శివాత్మిక‌!

Rajasheker: గ‌తంలో విజ‌య్‌దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా వ‌చ్చిన దొర‌సాని సినిమాతో శివాత్మిక రాజశేఖ‌ర్ టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైందని విష‌యం తెలిసిందే. తొలి సినిమా ప్రేక్ష‌కులకు ఆశించిన స్థాయిలో లేకున్నా.. న‌టిగా మాత్రం మంచి మార్కులే ప‌డ్డాయి శివాత్మికకు. ఇక ప్ర‌స్తుతం శివాత్మిక ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిస్తున్న రంగ‌మార్తండ చిత్రంలో న‌టిస్తోంది.

shvathmika rajashker

అలాగే కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది ఈ భామ‌.. త‌మిళ ద‌ర్శ‌కుడు నందా పెరియ‌స్వామి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఓ ఫ్యామిలీ డ్రామాలో న‌టించేందుకు శివాత్మిక స‌న్న‌ద్ధం అవుతుంది. ఇందులో ప‌ల్లెటూరి అమ్మాయిగా, స్థానిక టీవీ ఛానెల్ యాంక‌ర్‌గా ప‌నిచేసే పాత్ర‌లో ఆమె క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. ఇక ఈ చిత్రంలో త‌మిళ ప్ర‌ముఖ న‌టుడు కార్తీక్ కొడుకు గౌత‌మ్ హీరోగా న‌టించ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఈ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. దీంతో శివాత్మిక రాజ‌శేఖ‌ర్ త‌మిళ ప్రేక్ష‌కుల‌ను కూడా ఏ ర‌కంగా మెప్పిస్తుందో వేచి చూడాలి.