“45” టీజర్ లాంఛ్ ఈవెంట్ లో పెద్ది చిత్ర విషయం బయట పెట్టిన శివరాజ్ కుమార్

శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “45”. ఈ చిత్రాన్ని సూరజ్ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీమతి. ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్యా “45” సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నిర్మాత ఎం.రమేష్ రెడ్డి మాట్లాడుతూ – మా 45 మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ సినిమాను మేమంతా ఇష్టపడి, కష్టపడి చేశాం. మీ సపోర్ట్ మా మూవీకి కావాలి. ఇలాంటి కాన్సెప్ట్ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటిదాకా రాలేదని చెప్పగలను. ఇప్పుడున్న సామాజిక పరిస్థితులకు 45 లాంటి మూవీ కావాలి. సనాతన ధర్మం గురించి ఈ చిత్రంలో అంశాలుంటాయి. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ తో 45 మూవీ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ లాంఛ్ లో మా మూవీ గురించి మరింత వివరంగా మాట్లాడుతాను. అన్నారు.

దర్శకుడు అర్జున్ జన్యా మాట్లాడుతూ – 45 మూవీని శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టితో చేయడం సంతోషంగా ఉంది. శివరాజ్ కుమార్ గారికి కథ చెప్పినప్పుడు ఈ సినిమాకు నువ్వే డైరెక్షన్ చేయి అని ఎంకరేజ్ చేశారు. ఆయన మాటతోనే ఈ సినిమాకు దర్శకత్వం చేసే కాన్ఫిడెన్స్ వచ్చింది. శివరాజ్ కుమార్ గారు ఈ సినిమాలో ఒక కొత్త తరహా పాత్రలో కనిపిస్తారు. ఆయనకు ఆరోగ్యం బాగా లేకున్నా, ఎంతో సపోర్ట్ చేసి సినిమాలో నటించారు. ఉపేంద్ర గారిని ఎలాంటి పాత్రలోనైనా డైరెక్టర్స్ చూపించగలరు. ఆయన దర్శకులకే దర్శకుడు. 45 మూవీని మూవీని ముందుగా సీజీ, డైలాగ్స్, బీజీఎంతో సహా విజువలైజ్ చేసి, ఆ తర్వాత షూటింగ్ చేశాం. ఈ పద్ధతి వల్ల ఒక్క సీన్ కూడా వేస్టేజ్ ఉండదు , ప్రొడ్యూసర్స్ కు బడ్జెట్ ఆదా అవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా గొప్ప దర్శకులు ఉన్నారు. వారు కూడా ఇలాంటి ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నా. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో స్క్రీన్ ప్లే పరంగా కొత్తదనంతో ఉండే చిత్రమిది. అన్నారు.

హీరో ఉపేంద్ర మాట్లాడుతూ – 45 మూవీలో నన్ను చాలా కొత్తగా చూపించారు దర్శకుడు అర్జున్ జన్యా. ఆయన కథ చెప్పేందుకు వచ్చినప్పుడు నేను ఇంట్లో కాజువల్ గా ఉన్నాను. అది చూసి ఈ మూవీలో నా గెటప్ అలాగే ఉండాలని డైరెక్టర్ చెప్పారు. ఈ చిత్రంలో ఓం సినిమాకు సంబంధించిన ఓ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ను ఎంతో క్రియేటివ్ గా ఈ మూవీలో ఉపయోగించారు దర్శకుడు అర్జున్ జన్యా. ఆయన వందకు పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అందులో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. అలాంటి క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రంతో దర్శకుడు కావడం సంతోషంగా ఉంది. శివరాజ్ కుమార్ గారితో ఓం సినిమా రూపొందించాను. ఆ సినిమా షూటింగ్ రెండో రోజే నేను గొప్ప దర్శకుడిని అవుతానని మీడియా ముందు చెప్పారు. శివన్న అలా చెప్పడం చూసి నేను కంగారుపడ్డాను. లేదు నువ్వు దర్శకుడిగా గొప్ప స్థాయికి వెళ్తావని చెప్పారు. ఆయనతో కలిసి ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. 45 మూవీ స్టోరీ ఎంటి, మా క్యారెక్టర్స్ ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే ఇందులో క్లాస్, మాస్, ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. కూలీ సినిమాలో రజినీకాంత్, నాగార్జున గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. రజినీకాంత్ గారికి నేను ఏకలవ్య శిష్యుడిని. అన్నారు.

హీరో శివరాజ్ కుమార్ మాట్లాడుతూ – దర్శకుడు అర్జున్ జన్యా 45 సినిమా కథను నాకు నాలుగు నుంచి ఐదు నిమిషాలు చెప్పారు. అలా ఈ సినిమాకు 45 అనే టైటిల్ పెట్టుకున్నాం. కథ చెప్పాక అర్జున్ జన్యా మరో దర్శకుడికి ఎవరికైనా డైరెక్షన్ బాధ్యతలు ఇస్తానని అన్నాడు. ఈ కథకు నువ్వే న్యాయం చేయగలవు అని చెప్పి అర్జున్ ను ఒప్పించాను. ఈ చిత్రంలో ఉపేంద్రతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. అతను ఎంతో టాలెంటెడ్. సినిమానే లోకంగా బతుకుతుంటాడు. ఎన్నో విషయాలు ఉపేంద్ర నుంచి నేర్చుకున్నాను. ఈ రోజు రాజ్ బి శెట్టి ఈవెంట్ కు రాలేకపోయారు. 45 సినిమాలో నేను, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ఎవరి పాత్రలదీ పైచేయి కాదు. కథే ఈ సినిమాకు హీరో. కథే మెయిన్ స్కోర్ చేస్తుంది. డైరెక్టర్ అర్జున్ కు మంచి పేరొస్తుంది. కొత్త స్క్రీన్ ప్లేను తెరపై చూస్తారు. ఈ సినిమా షూటింగ్ చివరలో నాకు క్యాన్సర్ అని తెలిసింది. కీమో థెరపీ తీసుకుంటూనే షూటింగ్ చేశాను. నాకు మా మూవీ టీమ్ ఎన్నో మినహాయింపులు ఇస్తాం, మీరు అది చేయొద్దు ఇది చేయొద్దు అని అన్నారు కానీ నేను చేయగలిగినప్పుడు మోసం చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నా క్యారెక్టర్ కు ఉన్న అన్ని రకాల సీన్స్ చేశాను. రామ్ చరణ్ గారితో కలిసి పెద్ది చిత్రంలో నటిస్తున్నాను. చిత్ర స్క్రిప్ట్ చాలా బావుంది. నేను ఇప్పటికే 2 రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాను. క్యారెక్టర్ కు మంచి ప్రత్యేకత ఉంది. చరణ్ వ్యక్తిత్వం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. జైలర్ సినిమాలో నా పాత్రకు అంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. రజినీకాంత్ కోసమే ఆ సినిమా చేశాను. ఇప్పుడు జైలర్ 2లోనూ కనిపించబోతున్నా. అన్నారు.

నటీనటులు – శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి, తదితరులు

టెక్నికల్ టీమ్ :

స్టోరీ, మ్యూజిక్, డైరెక్టర్ – అర్జున్ జన్యా
ప్రొడ్యూసర్ – శ్రీమతి. ఉమా రమేష్ రెడ్డి, ఎం రమేష్ రెడ్డి
బ్యానర్ – సూరజ్ ప్రొడక్షన్
సినిమాటోగ్రఫీ – సత్య హెగ్డే
ఎడిటర్ – కేఎం ప్రకాష్
డైలాగ్స్ – అనిల్ కుమార్
ఆర్ట్ – మోహన్ పండిత్
పీఆర్ఓ – వీరబాబు