‘శివంగి’ చిత్ర రివ్యూ

ఆనంది ముఖ్యపాత్రలో నటిస్తూ ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై దేవరాజ్ భరణి ధరణ్ రచన దర్శకత్వంలో ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రం శివంగి. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్ర పోషించగా జాన్ విజయ్, కోయ కిషోర్ తదితరులు నటించారు. నరేష్ బాబు పంచుమర్తి నిర్మాతగా వ్యవహరించగా కాశిఫ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. రఘు కులకర్ణి ఆర్ట్ డైరెక్టర్గా, భరణి కె ధరణ్ డిఓపిగా చేసిన ఈ చిత్రం ఈనెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక చిత్ర విశేషాలకి వస్తే…

కథ :
ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న మహిళ ఆనంది(సత్యభామ) వివాహం జరిగినప్పటినుండి ఒక సమస్యతో బాధపడుతుంటుంది. అయితే వివాహం జరిగిన ఒక సంవత్సరం తర్వాత ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆ సమయంలోనే ఒక అనుకోని సంఘటన వల్ల తాను మరో సమస్యలో చిక్కుకోవడం జరుగుతుంది. అసలు వివాహం జరిగిన వెంటనే తనకు వచ్చిన సమస్య ఏంటి? ఆ సమస్య నుండి బయటపడుతున్న సమయంలో వచ్చిన మరో సమస్య ఏంటి? ఈ కథలోకి పోలీస్ గా వరలక్ష్మి శరత్ కుమార్ ఎందుకు వచ్చారు? చిత్ర ట్రైలర్ లో చూపించినట్లు ఆనంది జీవితమంతా సమస్యలే ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఆ సమస్యలకు ఆనంది ఎటువంటి పరిష్కారం చూసుకుంది. చివరిగా తన సమస్యలు తీరాయా లేదా? అసలు పోలీసులను కాంటాక్ట్ చేసే అంత పెద్ద సమస్య ఏం వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటులు నటన:
ఈ చిత్రంలో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఆనంది నటన గురించి. చిత్రంలో ఎక్కువగా మనకు కనిపించేది ఆనంది. తను ఒక్కటే స్క్రీన్ పై కనిపిస్తున్నప్పటికీ ప్రేక్షకులకు ఎక్కడ బోర్ కొట్టకుండా తనదైన శైలిలో తాను నటిస్తూ ప్రేక్షకులను ఎంతో ఇంటెన్సిఫై చేసే విధంగా కట్టిపడేసింది. చిత్రంలో గ్లామర్ తో పని లేకుండా చాలా చక్కగా నటిస్తూ, సీన్లకు తగ్గ ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంది. వరలక్ష్మి శరత్ కుమార్ గతంలో పోలీస్ రోల్ చేసినప్పటికీ ఈ చిత్రంలో ఆమె తెలంగాణ యాస ప్రత్యేకమని చెప్పుకోవాలి. చిత్రంలోని సీనులకు తగ్గట్లు నటిస్తూ తన పరిధిలో తను నటిస్తూ వచ్చారు. అదేవిధంగా ఈ చిత్రంలో నటించిన వారు తక్కువైనప్పటికీ మనకు వినిపించేవారు చాలా ఎక్కువమంది ఉంటారు. వాళ్లు కనిపించకపోయినా వారి మాటలు వినిపిస్తూ ఉండడంతో వారు కూడా చిత్రంలో కీలక పాత్రలు పంచుకుంటూ కథలో భాగమై ఉంటారు.

సాంకేతిక విశ్లేషణ:
చిత్ర రచనా దర్శకుడు దేవరాజు భరణి ధరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడంలో ఎంత ప్లాన్డ్ గా ఉన్నాడో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అతి తక్కువ నటీనటులతో ఒకటే లొకేషన్లో తాను ప్రేక్షకులకు చెప్పాలనుకున్న కథను చాలా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తూ ప్రేక్షకులు తమ సీట్లో నుండి కదలకుండా కట్టిపడేసే విధంగా స్క్రీన్ ప్లే నడుపుతూ మంచి విజయం సాధించారని చెప్పుకోవాలి. అదేవిధంగా లొకేషన్ ఒక్కటే కావడంతో ఆ లొకేషన్ లోనే ఎంతో క్వాలిటీ అవుట్ ఫుట్ వచ్చే విధంగా పెట్టే నాణ్యత అంతా ఒకేచోట పెడుతూ ఎక్కడ కాంప్రమైజ్ కాని విధంగా నిర్మాణ విలువలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చిత్ర క్వాలిటీ చూస్తేనే నిర్మాత ఈ చిత్రానికి ఎంత విలువ ఇచ్చారు అనేది అర్థమవుతుంది. అదేవిధంగా లొకేషన్ లోని ప్రతి బ్యాగ్రౌండ్ లోను ఆర్ట్ డైరెక్టర్ చేసిన పనితీరు కనిపిస్తుంది. సీన్లకు తగ్గట్లు బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత ఇంటెన్సిటీని పెంచుతూ వచ్చింది. కలరింగ్ ఇంకా ఇతర సాంకేతిక విషయాలలో దర్శకుడు తగ్గ జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థమవుతుంది. మనకు తెరపై ఎక్కువగా కనిపించేది ఒక్కరే అయినప్పటికీ ఎక్కడ బోర్ ఫీల్ కాకుండా ఉండటం అనేది అసాధ్యమనే చెప్పుకోవాలి. కానీ ఈ చిత్రంలో ఎక్కడా కూడా బోర్ కొట్టే ఫీలింగ్ రాకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు.

ప్లస్ పాయింట్స్ :
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నటీనటుల నటన, బ్యాక్గ్రౌండ్ స్కోర్, నిర్మాణ విలువలు.

మైనస్ పాయింట్స్:
ఒకటే లొకేషన్ కావడం, సినిమా అంతా ఒకరే ఎక్కువగా కనిపిస్తూ ఉండడం.

సారాంశం :
ఆడవారు తమకు ఏదైనా సమస్య వస్తే ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎలా నిలబడతారు అనేది వివరిస్తూ ఎక్కడా ఎటువంటి వలిగారిటీ లేకుండా కుటుంబ సమేతంగా కూర్చొని ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూసే విధంగా ఈ చిత్రం ఉంది.