దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదలైన శివ నాగేశ్వరరావు ‘దోచేవారెవరురా’ టైటిల్ ఫస్ట్ లుక్..

IQ క్రియేషన్స్ బ్యానర్ పై బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరావు తెరకెక్కిస్తున్న సినిమా ‘దోచేవారెవరురా’. తాజాగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదలైంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దోచేవారెవరురా’ టైటిల్ చాలా బాగుంది అని.. సినిమా కూడా అంతే బాగుంటుందని నమ్ముతున్నట్లు చెప్పారు వర్మ. తనకు శివ నాగేశ్వరరావుతో మొదటి సినిమా నుంచి ప్రత్యేకమైన అనుబంధం ఉంది అని తెలిపారు. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు.
దర్శకుడు శివనాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాముతో మాకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయనతో నేను ఉన్నంత క్లోజ్ గా మా బ్యాచ్ లో ఎవరు ఉండరు. దర్శకుడిగా నాకు మొదటి అవకాశం ఇచ్చింది ఆయనే. ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేసినందుకు థాంక్యూ.. అని తెలిపారు.  ఈ చిత్రం లోఅజయ్ గోష్, బిత్తిరి సత్తి ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు
బ్యానర్   :  IQ క్రియేషన్స్ దర్శకుడు:  శివనాగేశ్వరరావునిర్మాత.   :  బొడ్డు కోటేశ్వరరావుపి.ఆర్.ఓ :  లక్ష్మీ నివాస్