హీరో సెకండ్ లుక్ రిలీజ్… క్రిష్ ని గుర్తు చేస్తున్న #SK

రేడియో జాకీగా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు కోలీవుడ్ యంగ్ హీరోస్ లో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో శివ కార్తికేయన్. రీసెంట్ గా నమ్మ వీటు పుల్లై సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇదే జోష్ ని కంటిన్యూ చేస్తూ శివ కార్తికేయన్ తన నెక్స్ట్ సినిమా ‘హీరో’ షూటింగ్ జెట్ స్పీడ్ లో నడిపిస్తున్నాడు. పీఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి సెకండ్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. సూపర్ హీరో లుక్ లో, క్రిష్ ని గుర్తు చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.

hero second look

కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అర్జున్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తుండగా, రూబెన్ ఎడిటింగ్, జార్జ్ విలియమ్స్ కెమెరా వర్క్ చేస్తున్నాడు. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకి రానున్న హీరో సినిమాని కేజేఆర్ స్టూడియోస్ నిర్మిస్తోంది. బాలీవుడ్ నటుడు, దేవ్ డీ… ఓయ్ లక్కీ లక్కీ ఓయ్ ఫేమ్ అభయ్ డియోల్ హీరో సినిమాతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా హీరో సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.