తమిళ హీరోకి తెలుగు హీరోకి పోటీ

డియర్ కామ్రేడ్ సినిమాతో డల్ అయిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మళ్లీ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లోనే ఒక సినిమా చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకి హీరో అనే టైటిల్ ఫిక్స్ చేశారు. గత చిత్రం లాగే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకి ఇప్పుడు ఒక కోలీవుడ్ హీరో నుంచి కొత్త చిక్కు వచ్చి పడింది.

కోలీవుడ్ యంగ్ హీరోస్ లో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో శివ కార్తికేయన్. విశాల్ తో అభిమన్యుడు లాంటి హిట్ సినిమా తీసిన పీఎస్ మిత్రన్ కలిసి శివ కార్తికేయన్ ఇప్పుడొక సినిమా చేస్తున్నాడు. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కూడా హీరో అనే టైటిలే ఫిక్స్ చేశారు. దీంతో హీరో అనే టైటిల్ కోసం ఒక టాలీవుడ్ హీరో, ఒక కోలీవుడ్ హీరో పోటీ పడుతున్నట్లు అయ్యింది. నిజానికి ఈ వివాదం ఎప్పటి నుంచో ఉన్నా కూడా శివ కార్తికేయన్, రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయడంతో ఆ వివాదం మళ్లీ బయటకి వచ్చింది. చేతిలో ఒక సూపర్ మాస్క్ పట్టుకున్న శివ కార్తికేయన్ పోస్టర్ లో చాలా మ్యాన్లీ లుక్ లో కనిపిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ కూడా త్వరలోనే బయటకి రానుంది. తమిళ సినిమాకి ఈ టైటిల్ కన్ఫర్మ్ అయ్యింది, అదే పేరుతో తెలుగులో కూడా రిలీజ్ కాబోతోంది కాబట్టి మన రౌడీ, హీరో టైటిల్ ను వడులుకుంటాడా లేక తెలుగులో అలానే ఉంచేసి తమిళ్ కి మాత్రమే టైటిల్ మార్చుకుంటాడా అనేది చూడాలి.