Kollywood: కోలీవుడ్ స్టార్ హీరో శింబుకు తమిళనాడులో లవర్‌బాయ్ అనే ఎంతో క్రేజ్ ఉంది. అయితే నాలుగు రోజుల్లోనే శింబు బర్త్‌డే.. ఫిబ్రవరి 3వ తేదీన 38లోకి అడుగుపెట్టనున్నాడు శింబు.. ఇప్పుడే ఎందుకు ఈ విషయం అనుకుంటున్నారా?.. తాజాగా శింబు తన ట్విట్టర్ వేదిక ద్వారా సంచలన ప్రకటన చేశారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏంటంటే.. జీవితంలో నేను ఎన్నో ఇబ్బందులు, సినిమా కష్టాలను చూశాను..
కానీ మీ ప్రేమాభిమానాలు మాత్రం ప్రతి క్షణం నాతోనే ఉన్నాయి. వరుసగా సినిమాలు ఓకే చేయడానికి మీ అభిమానమే కారణం. నేను నటించిన Kollywood ఈశ్వరన్ సినిమాపై మీరు చూపించిన అభిమానం, ప్రేమకు ఎంతలా కృతజ్ఞతలు తెలిపినా తక్కువే.. మిమ్మల్ని నేను నా కుటుంబసభ్యులుగా భావిస్తాను. అయితే ఫిబ్రవరి 3న నా జన్మదినం మీతో జరుపుకోవాలని అనుకున్నాను.. కానీ ఎప్పటి నుంచో ఓ చోటుకి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాను.. అలా ఈ పుట్టినరోజుకు అక్కడికి వెళ్తున్నాను.. ఆ రోజు చెన్నైలో ఉండడంలేదు.. అందువల్ల దయచేసి అభిమానులు మా ఇంటికి రావొద్దు అని శింబు ట్వీట్ చేశారు. Kollywood దీంతో సోషల్ మీడియాలో అభిమానుల వల్లే ఈ స్థాయికి వచ్చారంటున్నారు.. మరీ మీ పుట్టినరోజు వేడుకలకు అభిమానులతో పంచుకుని ఆ తర్వాత మీరు ప్లాన్ చేసుకోవచ్చు కదా.. ప్రతి హీరోకు, ప్రతి కళాకారుడికి సంతోషం ఎక్కడంటే అభిమాన చప్పట్లతోనే సంతోషం ఉంటుంది.. అలా కాదని మీ పుట్టినరోజు వేడుకలకు అభిమానులను వదిలి మరే అక్కడ వెళ్లే చోట చాలా సంతోషంగా ఉంటుంది అంటే ఓకే.. అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే శింబు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.