థియేటర్ల‌లోకి వ‌స్తున్న‌ శ్రియ‌, త‌మ‌న్నాల సినిమా!

Shimbu: త‌మిళ హీరో శింబు హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం ఏఏఏ. ఈ చిత్రాన్ని అధిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తుండ‌గా.. నిర్మాత యాళ్ళ వెంక‌టేశ్వ‌ర‌రావు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ సినిమాలో శింబుకు జోడీగా శ్రియ‌, త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా జ‌వ‌వ‌రి 22న తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా ఈ చిత్రానికి కావాల్సిన అన్ని హంగుల‌ను స‌మ‌కూర్చామ‌న్నారు.

shimbu AAA film

ఈ సినిమాలో Shimbu: యాక్ష‌న్‌తో పాటు హీరోయిన్ల గ్లామ‌ర్ క‌ల‌బోసుకొని వ‌స్తుంది.. అలాగే ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన త‌మిళ ద‌ర్శ‌కుడు ర‌విచంద్ర‌న్ ఎంతో ప్ర‌తిభావంత‌మైన ద‌ర్శ‌కుడని కొనియాడారు. ఇటీవ‌లే రిలీజ్ అయినా తెలుగు ట్రైల‌ర్‌కు సినీ ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింద‌ని.. త‌ప్ప‌కుండా ఈ చిత్రం తెలుగులో మంచి విజ‌యం సాధిస్తుంద‌ని చాలా గట్టి న‌మ్మ‌కం ఉంద‌ని నిర్మాత వెంక‌టేశ్వ‌ర‌రావు పేర్కొన్నారు. ఇక మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ శంక‌ర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు.