Shyamsinghroy: నాని సినిమాలో నితిన్ సినిమా విల‌న్‌..

Shyamsinghroy: నేచుర‌ల్‌స్టార్ నాని శ్యామ్ సింగ్‌రాయ్ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.. ఈ చిత్రం నుంచి ఇటీవ‌లే నాని బ‌ర్త్‌డే కానుక‌గా ఫ‌స్ట్‌లుక్‌ రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఆ పోస్ట‌ర్‌లో నాని లుక్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది. దీంతో ప్రేక్ష‌కులు ఈ సినిమా కోసం ఎంతోగాను ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ప్ర‌స్తుతం ఈ Shyamsinghroyచిత్ర షూటింగ్ కోల్‌క‌తాలోనే జ‌రుగుతుంది.

కాగా తాజాగా ఈ Shyamsinghroyచిత్రంలో విల‌న్ పాత్ర కోసం ప్ర‌ముఖ బెంగాళీ న‌టుడు, భీష్మ విల‌న్ జిషు సేన్ గుప్తా విల‌న్‌గా చేస్తున్నాడు. ఈ మేర‌కు జిషును ఆహ్వానిస్తూ చిత్ర‌బృందం పోస్ట్ పెట్టింది. ఇక ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న సాయిప‌ల్ల‌వి, కృతిశెట్టి, మ‌డోనా సెబాస్టియ‌న్‌ హీరోయిన్ల్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమాను నిహారికా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ బోయిన‌ప‌ల్లి నిర్మిస్తుండ‌గా.. రాహుల్ సంకీర్తన్ ఈ Shyamsinghroyచిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.