శ‌ర్వానంద్ ‘శ్రీ‌కారం’ రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో శ‌ర్వానంద్ నటించిన ‘శ్రీ‌కారం’‌ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా కిశోర్ బి ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ఇందులో ప్రియాంకా అరుళ్ మోహ‌న్ హీరోయిన్‌గా నటిస్తోంది. 14 రీల్స్ ప్ల‌స్‌ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

SREEKARAM RELEASE DATE CONFIRMED

ఇవాళ రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను శ్రీకారం యూనిట్ విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో గ‌ళ్ల లుంగీ, కాట‌న్ ష‌ర్ట్‌, భుజాన కండువాతో న‌వ్వుతూ నిల్చొని శర్వానంద్ కనిపించాడు.
. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుద‌ల చేసిన “బ‌లేగుంది బాలా”, “సంద‌ళ్లె సంద‌ళ్లే సంక్రాంతి సంద‌ళ్లే..” పాట‌లు సూపర్ హిట్ అయ్యాయి. యూట్యూబ్‌లో వీటికి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే స్పెష‌ల్ టీజ‌ర్‌కు మంచి స్పందన వచ్చింది.

మిక్కీ జె. మేయ‌ర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తుండగా.. బుర్రా సాయిమాధ‌వ్ డైలాగ్స్ అందించారు. ఇక జె. యువ‌రాజ్ సినిమాటోగ్రఫీ అందించారు. గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్ నుంచి వ‌స్తోన్న‌ రెండో చిత్రం ‘శ్రీ‌కారం’.