Tollywood: శ‌ర్వా శ్రీ‌కారం నుంచి మూడో పాట రిలీజ్‌..

Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్ న‌టిస్తున్న తాజా చిత్రం శ్రీ‌కారం. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్, సాంగ్‌ ప్రేక్ష‌కులను ఎంతో ఆక‌ట్టుకుంది. ఇప్పుడు తాజాగా మ‌రో సాంగ్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. హే అబ్బాయి అంటూ మూడో పాట లిరిక‌ల్ వీడియోను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. Tollywoodఈ చిత్రం నుంచి భ‌లేగుంది బాలా, సంద‌ళ్లే సంద‌ళ్లే పాట‌లు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది.

srikaram movie

ఇప్ప‌డు ఈ తాజా పాట కూడా ఎంతో అల‌రిస్తోంది. ఈ చిత్రానికి మిక్కీ జె మేయ‌ర్ స్వ‌రాలు అందించారు. ఈ తాజా పాట‌లో శ‌ర్వా వెంట‌ప‌డుతూ హీరోయిన్ ప్రియాంక మోహ‌న్ అత‌న్ని టీజ్ చేస్తూ ఆడి పాడుతుంది. Tollywoodదీంట్లో హీరోయిన్ ట్రెడీ కాస్ట్యూమ్స్‌తో అల‌రించింది. ఈ సాంగ్‌కు కృష్ణ‌సాగ‌ర్ లిరిక్స్ అందించ‌గా.. సింగ‌ర్స్ నూత‌న మోహ‌న్‌-హైమ‌త్ ఆల‌పించారు. ఇక ఈ చిత్రానికి కిశోర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో 14రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే Tollywoodఈ చిత్రంలో శ‌ర్వాకు జోడీగా గ్యాంగ్‌లీడ‌ర్ ఫేం ప్రియాంక మోహ‌న్ హీరోయిన్‌గా చేస్తుంది. ఇక ఈ చిత్రం శివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.