Tollywood: శ‌ర్వానంద్ కొత్త చిత్రం ఆడ‌వాళ్లు మీకు జోహార్లు..

Tollywood: నేడు టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్ బ‌ర్త్‌డే జ‌రుప‌కుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న కొత్త చిత్రం టైటిల్ పోస్ట‌ర్‌ను చిత్ర‌బృందం రిలీజ్ చేసింది. ఈ సినిమాకు ఆడ‌వాళ్లు మీకు జోహార్లు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ Tollywood చిత్రానికి తిరుమ‌ల కిశోర్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి

sharwanand

ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో శ‌ర్వాకు జోడీగా ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. త్వ‌ర‌లోనే ఈ Tollywood చిత్రం సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఇదిలా ఉంచితే నేడు శ‌ర్వా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న న‌టించిన మ‌హా స‌ముద్రం చిత్రం నుంచి ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. అలాగే ఆయ‌న న‌టించిన తాజా చిత్రం శ్రీ‌కారం విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది.