
చార్మింగ్ స్టార్ శర్వా తన మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ #Sharwa38ని ప్రారంభించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కొలాబరేషన్ శర్వా, దర్శకుడు సంపత్ నంది ఇద్దరికీ ఒక ముఖ్యమైన మైల్ స్టోన్ ని చూస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు.
1960ల చివరలో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో సెట్ చేయబడిన #Sharwa38 ప్రేక్షకులను మరపురాని అనుభూతిని అందించబోతోంది. ఈ చిత్రం హై-స్టేక్స్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది.
శర్వా పాత్రను ప్రత్యేకంగా నిలబెట్టడానికి, టీం బాలీవుడ్ స్టైలిస్టులు ఆలిమ్ హకీమ్, పట్టణం రషీద్‌ల నైపుణ్యాన్ని ఉపయోగించుకుంది. శర్వా మేకోవర్ ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది. తన న్యూ, బోల్డ్ హెయిర్‌స్టోను సినిమా1960ల కాలపు స్టయిల్ని ప్రజెంట్ చేస్తోంది.
#Sharwa38 కి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు, సౌందర్ రాజన్ S సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.
ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం,హిందీతో సహా పలు భాషలలో సినిమా విడుదల కానుంది.
నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: సంపత్ నంది
నిర్మాత: కేకే రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
సమర్పణ : లక్ష్మీ రాధామోహన్
DOP: సౌందర్ రాజన్ S
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
PRO: వంశీ-శేఖర్