Tollywood: నితిన్‌, నాని, వ‌రుణ్‌తేజ్ రిలీజ్ చేసిన‌ శ‌ర్వా ‘శ్రీ‌కారం’ ట్రైల‌ర్..

Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్ న‌టించిన తాజా చిత్రం శ్రీ‌కారం. ఈ చిత్రానికి కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో, 14రీల్స్ ప్ల‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో శ‌ర్వాకు జోడీగా ప్రియాంక అరుళ్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టించింది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్‌, సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేశాయి.. ఈ చిత్రం రైతు క‌థాంశంతో తెర‌కెక్కుతుండ‌డంతో ప్రేక్ష‌కులు ఈ Tollywood చిత్రంపై ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసింది చిత్ర‌బృందం.

Srikaaram trailer

ఈ మేర‌కు టాలీవుడ్ హీరోలు నితిన్‌, నాని, వ‌రుణ్‌తేజ్ చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైల‌ర్ రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. రైతు పాత్ర‌ల్లో శ‌ర్వానంద్ ఆక‌ట్టుకున్నాడు.. అలాగే ప్రియాంక అందం క‌నువిందు చేస్తోంది. ఉమ్మ‌డిగా చేసిన యుద్ధంలో రాజ్యాలే గెలిచాం.. సేద్యం కూడా గెల‌వొ్చు.. కార్పొరేట్ మీద న‌డ‌వాల్సిన వాడిని బుర‌ద‌లో న‌డుస్తావేంటి వంటి డైలాగ్స్ ఎంతో అల‌రిస్తున్నాయి. మొత్తం మీద రైతులు, వ్య‌వ‌సాయంపై ప్రాధాన్య‌త‌ను తెలియ‌జేయ‌డానికే ఈ చిత్ర ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఇక ఈ చిత్రానికి మిక్కీ జె.మేయ‌ర్ స్వ‌రాలు అందించ‌గా..ఈ Tollywoodచిత్రంలో సీనియ‌ర్ న‌రేశ్‌, సాయికుమార్‌, ముర‌ళి శ‌ర్మ‌, రావు ర‌మేష్‌, ఆమ‌ని, స‌త్య‌, స‌ప్త‌గిరి త‌దిత‌రులు ఈ Tollywoodచిత్రంలో న‌టించారు.