క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ హృతిక్ కలయిక జరిగేదేప్పుడు?

సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. సోషల్ మేసేజ్ కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ తో యాడ్ చేస్తూ టెక్నీకల్ పరంగాను హాలీవుడ్ స్థాయిలో ఆలోచిస్తూ సినిమాని తెరకెక్కిస్తాడు. శంకర్ ప్రస్తుతం చేస్తున్న భారతీయుడు 2 త‌ర్వాత బాలీవుడ్ యాక్ష‌న్ హీరో హృతిక్ రోష‌న్‌తో మూవీ చేయబోతున్నాడట. 2.ఓ సినిమాలో అక్షయ్ కుమార్ చేసిన పాత్ర కోసం ముందుగా శంకర్, హృతిక్ ను సంప్రదించాడు కానీ అప్పుడు వేరే కమిట్మెంట్స్ ఉండడంతో రోబో 2. ఓ సినిమా చేయలేక పోతున్నానని చెప్పిన హృతిక్ రోషన్ మరో ప్రాజెక్టు చేద్దామని అన్నాడట. ఇప్పుడు అదే కమిట్మెంట్ తో శంకర్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి టాక్స్, స్టోరీ డిస్కషన్స్ న‌డుస్తున్న‌ట్టు సమాచారం.

సూప‌ర్ హీరో స‌బ్జెక్ట్‌ని బేస్ చేసుకోని, హృతిక్ రోష‌న్‌ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు సైంటిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంలో శంకర్ లైన్ వినిసించడట. కథకి కనెక్ట్ అయిన హృతిక్ , శంకర్ డైరెక్షన్‌లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని బి-టౌన్ వర్గాల సమాచారం. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తుంది. ఈ సినిమాను నిర్మించడానికి నిర్మాతలు చాలామంది ఆసక్తిని చూపుతున్నరట. ఇండియ‌న్ 2 మూవీ త‌ర్వాత ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని తెలుస్తోంది. శంకర్ విజన్‌, హృతిక్ యాక్టింగ్ స్కిల్స్ తోడైతే ఇక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచలం సృష్టించ‌డం ఖాయమని ట్రేడ్ వర్గాలు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు.