బాలీవుడ్ స్టార్ హీరో కుమారుడితో అర్జున్ రెడ్డి హీరోయిన్ రోమాన్స్

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది షాలిని పాండే. ఈ సినిమాతో హిట్ అందుకున్న ఆమె.. ఆ తర్వాత టాలీవుడ్‌లో కూడా టాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో నటించింది. ప్రస్తుతం కూడా టాలీవుడ్‌తో పాటు పలు భాషల్లో సినిమాలు చేస్తూ ఈ బ్యూటీ బిజీబిజీగా గడుపుతోంది. అయితే బాలీవుడ్‌లో కూడా ఈ భామ అవకాశాలు కొట్టేస్తుంది.

shalini pandey

ఇప్పటికే బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో జయేష్ భాయ్ జోర్దార్ సినిమాలో షాలిని నటించింది. త్వరలో ఈ మూవీ విడుదల కానుంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో సినిమాలో షాలినికి అవకాశం దక్కింది. అది కూడా పెద్ద సినిమానే. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ త్వరలో బాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.

సిద్ధార్థ్ మల్హోత్రా ఈ సినిమాను తెరకెక్కించనుండగా.. ఇందులో షాలినీ హీరోయిన్‌గా నటించనుంది. యశ్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. రోమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కించనుండగా.. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ జరగనుంది.