అన్నిటికంటే.. మా అమ్మ హైదరాబాద్ బిర్యానీ మిన్న: షారుఖ్

బాలీవుడ్ సూపర్ స్టార్ గా గత మూడు దశాబ్దాలుగా హిందీ ఆడియెన్స్ ని మెప్పిస్తున్న షారుక్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో తన ఆహారపు అలవాట్ల గురించి చాల వివరంగా చెప్పారు. ఎంతో కష్టపడి బాలీవుడ్ బాద్ షా గా క్రేజ్ అందుకున్న కింగ్ ఖాన్ కూడా ఒకప్పుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అయితే తన తల్లిదండ్రులకు మాత్రం ఏనాడు తిండి విషయంలో తనను నిరుత్సాహ పరచలేదని షారుక్ అన్నాడు.

షారుక్ మాట్లాడుతూ.. సాధారణంగా చాలా మందికి బయట వంటకాలు అంటే ఎక్కువ ఇష్టపడతారు. ఇంట్లో చేసిన ఫుడ్ అంతగా ఇంట్రెస్ట్ చూపరు. కానీ నేను మాత్రం చిన్నప్పటి నుంచి మా అమ్మ, నాన్న కలిసి చేసే వంటకాలకు దాసోహం అయ్యాను. మా తండ్రి తాజ్ మొహమ్మద్ ఖాన్ వండిన పఠానీ ఫుడ్ రాన్ అంటే నాకు అమితమైన ఇష్టం. మా అమ్మ లతీఫ్ ఫాతిమా ఖాన్ హైదరాబాద్ కి చెందిన మహిళ. అమ్మ ఒక ఎస్ కూక్ అని చెబుతాను. ఎందుకంటే ఆమె మటన్ బిర్యానీ, ఖట్టి దాల్ వంటివి చాలా బాగా చేసేది అవి ఎప్పుడు తిన్నా కూడా చాలా కొత్తగా ఉండేవని షారుక్ వివరణ ఇచ్చారు.