సేతు: రామాయణ మహాకావ్యంలో ఎపిక్ విజువల్ వండర్ 

ప్రముఖ నిర్మాత అభిషేక్ నామ ఎక్స్ ట్రార్డినరీ కథలను ప్రేక్షకులు ముందుకు తీసుకురావడంలో పేరుపొందారు. ఇప్పుడు, ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ ‘సేతు’ నిర్మించేందుకు సిద్ధమయ్యారు. హరి కృష్ణ ఈ చిత్రానికి మరొక ప్రత్యేకతను జత చేస్తూ, సేతు ప్రేక్షకులను అలరించేలా మాత్రమే కాకుండా అద్భుతమైన క్యాలిటీతో విజువల్ వండర్ గా రూపొందిస్తున్నారు. 

పాపులర్ విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ హరి కృష్ణ, పుష్ప, దసరా వంటి బ్లాక్‌బస్టర్లకు తన అద్భుతమైన గ్రాఫిక్స్ తో గుర్తింపు పొంది, ఇప్పుడు దర్శకుడిగా మారి ప్రేక్షకులను చారిత్రక గాధల్లోకి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు. ఆయన అప్ కమింగ్ సినిమా సేతు, రామాయణ కథాప్రపంచాన్ని అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో బ్లెండ్ చేస్తూ ఒక కొత్త అనుభూతిని అందించనుంది.

15 సంవత్సరాలుగా VFX పరిశ్రమలో పని చేసిన హరి కృష్ణ, సినిమాటిక్ కలలను విజువల్ వండర్ గా ఆవిష్కరించడంలో నైపుణ్యాన్ని సాధించారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పలు చిత్రాలకు విశేషమైన విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ఆయన, ఇప్పుడు సేతు ద్వారా దర్శకుడిగా మారి భారతీయ ఎపిక్ సినిమాలకు కొత్త నిర్వచనాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

సేతు భారతీయ పురాణాలలో ప్రసిద్ధమైన సంఘటనల ఆధారంగా రూపొందిన ఇప్పటివరకూ వినని కల్పిత కథ. రామాయణంలోని యుద్ధాలు, వీర గాథలు, త్యాగం, ధర్మబద్ధత వంటి అంశాలను ఈ కథలో ప్రతిబింబించనున్నారు. ప్రేక్షకులు యుద్ధ దృశ్యాలు, విస్తృతమైన ప్రకృతి దృశ్యాలు, పురాణ గాధల స్ఫూర్తిని అందించే విలక్షణమైన పాత్రలతో ఒక గొప్ప అనుభూతిని పొందనున్నారు.

ప్రేక్షకులు సేతు విడుదలను ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఎపిక్ కథనాన్ని ఆధునిక టెక్నాలజీ ద్వారా మళ్లీ విన్నూత్నంగా ఎక్స్ పీరియన్స్ చేసే అవకాశం ఈ చిత్రంలో లభించనుంది. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు-హరి కృష్ణ, అభిషేక్ నామ కలిసి భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ఘనంగా ప్రజెంట్ చేసే ఒక విజువల్ వండర్. సేతు ఖచ్చితంగా ఒక చిరస్మరణీయమైన చిత్రం గా నిలవనుంది.