అక్కినేని హీరోపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన వర్మ…

ఎప్పుడూ ఎదో ఒక కామెంట్ చేసి విమర్శలు లేదా వివాదాలు కొని తెచ్చుకునే దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది తప్పకుండా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాత్రమే. ఒకప్పుడు సినిమాలతో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే వాడో, ఇప్పుడు ట్వీట్స్ తో అంతకన్నా ఎక్కువే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు. తనకి నచ్చని విషయం, నచ్చని వ్యక్తి, నచ్చని పని గురించి అనిపించింది అనిపించినట్లు ఓపెన్ గా చెప్పే వర్మ… తాజాగా అక్కినేని హీరో సుమంత్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ప్రేమకథ సినిమా కోసం కలిసి పని చేసిన ఈ ఇద్దరికీ ఒక మంచి బాండ్ ఉంది. వర్మ తీసిన ఏకైక లవ్ స్టొరీ ఫిల్మ్ కూడా ఇదే. అయితే అక్కినేని సుమంత్ 2004 లో తొలిప్రేమ సినిమా హీరోయిన్ కీర్తి రెడ్డిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత రెండేళ్లకే 2006లో సుమంత్ కీర్తి రెడ్డి నుంచి విడిపోయి పక్కకి వచ్చేసాడు. కీర్తి రెడ్డి రెండో పెళ్లి చేసుకోని యుఎస్ లో సెటిల్ అయిపొయింది కానీ సుమంత్ మాత్రం సింగల్ గానే ఉంటూ వచ్చాడు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత సుమంత్, పవిత్ర అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని, ఆల్రెడీ సీక్రెట్ గా చేసేసుకున్నాడని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయ్యింది. సుమంత్ కుమార్, పవిత్రల పేరుతో ఈ వెడ్డింగ్ కార్డ్ వైరల్ అవ్వడంతో సుమంత్ పెళ్లి గురించి వార్తలు హల్చల్ చేసాయి. ఈ విషయంపై స్పందించిన ట్వీట్ చేసిన వర్మ, “ఒకసారి అయ్యాక కూడా నీకింకా బుద్ది రాలేదా సుమంత్… నీ కర్మ, ఆ పవిత్ర కర్మ… అనుభవించండి” అనేశాడు. వర్మకి పెళ్లి పై ఉండే అభిప్రాయం ఎలాంటిదో అందరికే తెలిసిందే కాబట్టి కొంతమంది లైట్ తీసుకున్నారు కానీ కొంతమంది అక్కినేని అభిమానులు మాత్రం అందరూ నీలా ఉండరుగా, సెక్స్ కోసమే పెళ్లి చేసుకోరుగా అంటూ ఘాటు రిప్లైలు ఇస్తున్నారు. ఎవరు ఎలాంటి రిప్లైలు ఇచ్చినా వర్మ మాత్రం తనకి అనిపించింది చెప్పడంలో నో బ్యాక్ స్టెపింగ్ అసలు. వర్మ ట్వీట్ విషయం పక్కన పెడితే అసలు సుమంత్ పెళ్లి విషయం నిజమా కదా అనేది తెలియాల్సి ఉంది.