
స్వాతిముత్యం 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులకు “చిరు సత్కారం” చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆ సంస్థ వ్యవస్థాపకుడు ధీరజ అప్పాజీ పేర్కొన్నారు. తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ సౌజన్యంతో… ఏప్రిల్ 28న జరిగిన ఈ వేడుకలో ప్రముఖ నటులు – నిర్మాత – ప్రఖ్యాత స్థిరాస్తి వ్యాపారవేత్త, మాజీ పార్లమెంట్ సభ్యులు మాగంటి మురళీమోహన్, స్వర్గీయ ప్రధాని పి.వి.నరసింహారావు కుమార్తె, విద్యావేత్త – ఎమ్.ఎల్.సి. శ్రీమతి సురభి వాణిదేవి, బ్రహ్మశ్రీ ఎల్.వి. గంగాధర శాస్త్రి, ప్రముఖ నిర్మాత, ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్.ఎన్. సి.సి) అధ్యక్షులు కె.ఎస్. రామారావు, తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్. దామోదర్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, శ్రీమతి గిడుగు కాంతికృష్ణ, ప్రముఖ దర్శకనిర్మాత కూచిపూడి వెంకట్, జర్నలిస్ట్ – రైటర్ – డైరెక్టర్ ప్రభు, ఫిల్మ్ జర్నలిస్ట్ టర్నడ్ లిరిసిస్ట్ భాస్కరభట్ల, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ కొండేటి, తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వై.జె.రాంబాబు, మిమిక్రి లెజండ్ రమేష్, బహుముఖ ప్రతిభాశాలి పాకలపాటి విజయవర్మ, “ప్రొడ్యూసర్ బజార్” విజయ్, “సెల్సియస్ సిస్టమ్స్ – హోమ్ ఎలివేటర్స్” శ్రీనివాస్, సినేటేరియా వెంకట్, తెలుగుప్లెక్స్ వెబ్ సైట్ సి.యి.ఓ. ఎన్నారై కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు శ్రీమతి పాటిబండ్ల విజయలక్ష్మి, శ్రీమతి కోగంటి జమునారాణి, సర్వశ్రీ సామల జగన్మోహన రావు (జగన్), యు.వినాయకరావు, ప్రభు, ఎల్.వి.గంగాధర శాస్త్రి, మోహన్ గోటేటి, పసుమర్తి నాగేంద్రకుమార్, రామ నారాయణ రాజు.కె., ఈతరం సూర్య ప్రకాష్ రెడ్డి, వి.ఎస్.కేశవరావు, వల్లూరి రాఘవరావు, మామిడిపల్లి గిరిధర్, రెంటాల జయదేవ, బత్తుల ప్రసాద్, నాగభైరు సుబ్బారావు, వడ్డి ఓం ప్రకాశ్ నారాయణ, ప్రసన్న ప్రదీప్, రమణ జె.పి.వి., లంక రాంబాబువర్మ, ఫోటో జర్నలిస్టులు రామసాయి రమేష్, ఇటికాల జనార్దన్ రెడ్డి, గోపిశెట్టి శ్రీనివాస్,, ఎమ్.ఎన్. భూషణ్, వాసు సజ్జా స్వాతిముత్యం చిరు సత్కారం స్వీకరించారు. తాను సినిమా రంగం పట్ల ఆకర్షితుడ్ని కావడానికి కారకులైన వీరందరికీ అప్పాజీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమ నిర్వహణకు ఆర్ధికంగా వెన్నుదన్నుగా నిలిచిన శ్రీమతి గిడుగు కాంతికృష్ణ, ప్రముఖ దర్శకనిర్మాత, “కూచిపూడి పలావ్” అధినేత కూచిపూడి వెంకట్, “షీరో హోమ్ ఫుడ్స్” పాకలపాటి విజయ్ వర్మ, “ప్రొడ్యూసర్ బజార్” విజయ్, “సెల్సియస్ సిస్టమ్స్ – హోమ్ ఎలివేటర్స్” శ్రీనివాస్, స్విస్ క్యాజిల్, మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ ప్రతినిధి సినేటెరియా వెంకట్, తెలుగుప్లెక్స్ సి.యి.ఒ. ఎన్నారై కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డిలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అప్పాజీ పేర్కొన్నారు.