బంగార్రాజుతో మరో సీనియర్ హీరోయిన్ రోమాన్స్

కింగ్ నాగ్ తన సూపర్ హిట్ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయన’ కి సీక్వెల్ చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. సీక్వెల్ ‘బంగార్రాజు’ స్క్రిప్ట్‌ వర్క్ కంప్లీట్ అయ్యింది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ ప్రాజెక్ట్ లో నాగార్జున, రమ్యకృష్ణతో పాటు మరో సీనియర్ హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉందనే వార్త వినిపిస్తోంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయప్రద బంగార్రాజు సినిమాలో ఒక క్యారెక్టర్ చేయనుందట. విలేజ్ ప్లే బాయ్ స్టొరీలో జయప్రద క్యారెక్టర్ సినిమాలో చాలా ఇంపార్టెంట్ అని అంతా అనుకుంటున్నారు. జూలై నుండి బంగార్రాజు షూటింగ్‌ను కూడా ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. మొదట బంగార్రాజు సినిమాలో నాగ్, చైతు కలిసి నటిస్తున్నారు అనే రూమర్ స్ప్రెడ్ అయ్యింది.

అయితే యువసామ్రాట్ చైతు ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ లో కాకుండా జస్ట్ గెస్ట్ రోల్‌లో మాత్రమే కనిపిస్తాడట. చైతు కొడుకు పాత్రలో అక్కినేని అఖిల్ కనిపిస్తాడట. తాత మనవళ్ల చుట్టూ తిరిగే ఈ సినిమా ఎప్పుడో మొదలు కావాల్సి ఉంది. అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ ప్రాజెక్ట్… సెట్స్ పైకి వెళ్ళలేకపోయింది. మొత్తానికి ‘బంగార్రాజు’ రాక ఆలస్యమైనా సినిమా ఆసక్తికరంగా ఉంటుందట.