నితిన్ సినిమాతో పాత హీరో రీఎంట్రీ

యంగ్ హీరో నితిన్, టాలెంటెడ్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ కలిసి నటిస్తున్న సినిమా రంగ్ దే. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి. రంగ్ దే ఫస్ట్ లుక్, టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో నితిన్ మరో హిట్ అందుకుంటాడని అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో మొదలయ్యింది. ఇటలీలో జరగాల్సిన షెడ్యూల్ కరోనా కారణంగా ఇక్కడే సెట్స్ వేసి చేస్తున్నారు. అయితే ఈ రంగ్ దే సినిమాలో నితిన్ ని బావగా వినీత్ కనిపించనున్నాడు. ప్రేమ దేశం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న వినీత్ 2006 తర్వాత తెలుగు తెరపై కనిపించలేదు. అతన్ని మళ్లీ తెలుగులోకి తెస్తే ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందనే మేకర్స్ ఈ డెసిషన్ తీసుకున్నట్లు ఉన్నారు. క్లాసికల్ డాన్సర్ అయిన వినీత్ అక్టోబర్ చివరి వారంలో హైదరాబాద్ షెడ్యూల్ లో పాల్గొననున్నాడు.