నటుడు చంద్రకాంత్ చేతుల మీదుగా ‘రావే నా చెలియా’ ట్రైలర్ విడుదల

సూర్య చంద్ర ప్రొడక్షన్ బ్యానర్‌లో నెమలి అనిల్, సుభాంగి పంత్, విరాజ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రావే నా చెలియా’. కీర్తి శేషులు నెమలి సురేష్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్వర్ రెడ్డి దర్శకుడు. ఏడు నెలల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. ఇటీవల థియేటర్స్ మళ్లీ తెరుచుకోవడంతో ఆగస్టు 13న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు చంద్రకాంత్ ట్రైలర్ విడుదల చేయగా.. సినిమాలోని మొదటి పాటను నటుడు కృష్ణతేజ్ విడుదల చేశారు. మరో పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ పాల్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా చంద్రకాంత్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో ఉన్న పాటలు చాలా బాగున్నాయి, అలాగే లిరిక్స్, డిఓపి వర్క్ ఇంకా బాగున్నాయి. ఇక డైలాగ్స్ అయితే ఇరగదీశారు. ఈ చిత్ర నిర్మాత నెమలి సురేష్ ఇటీవలే చనిపోయారని తెలిసింది. ఒక మంచి ప్రొడక్ట్ ఇచ్చి చూడకుండానే ఆయన లేకపోవడం చాలా బాధాకరం. మంచి సబ్జెక్ట్‌తో ముందుకొచ్చిన డైరెక్ట్ మహేశ్వర్ రెడ్డికి మరెన్నో మంచి అవకాశాలు రావాలని, సినిమాకు మంచి డబ్బు చేకూరాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

డైరెక్టర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు 6న సాయంత్రం 5 గంటలకు యూట్యూబ్‌లో ట్రైలర్ విడుదల చేయనున్నాము. అలానే ఈ చిత్రాన్ని ఆగస్ట్ 13న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్‌లో విడుదల చేయనున్నాము. ఈ చిత్రానికి టీమ్ అందించిన సపోర్ట్ మరిచిపోలేను. తెలుగు ప్రేక్షకులు చిత్రాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము..’’ అన్నారు.

కొరియోగ్రాఫర్ పాల్ మాట్లాడుతూ.. ‘‘రావే నా చెలియా చిత్రంతో నా రీ ఎంట్రీ కుదిరింది. హీరో హీరోయిన్స్ చాలా బాగా సపోర్ట్ చేసి డాన్స్ బాగా చేశారు. ఈ చిత్ర నిర్మాత నెమలి సురేష్‌గారు చాలా సపోర్టివ్‌గా ఉండేవారు. మా అబ్బాయి హీరోగా సంవత్సరానికి మూడు సినిమాలు చేయాలని నా కోరిక అనే వారు. ఇప్పుడు చిత్రం విడుదలవుతున్న సమయంలో ఆయన మన మధ్య లేకపోవడం నన్ను చాలా బాధిస్తోంది. ఎన్ని కష్టాలు ఉన్నా సినిమా విడుదల వరకు తీసుకొచ్చిన హీరో నెమలి అనిల్‌ను, డైరెక్టర్ మహేశ్వర్ రెడ్డిని అభినంచాలి. సినిమా చాలా బాగా వచ్చిందని తెలిసింది. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్ సుబాంగి పంత్, నటుడు అంకిరెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కుమార్, డైలాగ్ రైటర్ మల్లేశ్వర్ బొగ్గ, ఫైట్ మాస్టర్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

నెమలి అనిల్, సుబాంగి పంత్, విరాజ్, సీనియర్ నటి కవిత, రఘు కారుమంచి, రచ్చ రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి
డిఓపి: విజయ్ ఠాగూర్,
డైలాగ్స్: మల్లేశ్వర్ బుగ్గ,
ఎడిటర్: రవి మన్ల,
మ్యూజిక్: ఎమ్ ఎమ్ కుమార్,
ఫైట్స్: అవినాష్ మాస్టర్,
ఆర్ట్: నారాయణ,
కొరియోగ్రాఫర్: పాల్ మాస్టర్,
పిఆర్వో: బి. వీరబాబు
నిర్మాత: కీ.శే. నెమలి సురేష్,
కథ-దర్శకత్వం: మహేశ్వర రెడ్డి