యుద్దానికి సిద్ధమయ్యారు… గెలిచేదెవరో? నిలిచేదెవరో

సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురములో… జనవరి 12న మహేశ్ బాబు, అల్లు అర్జున్ లు బాక్సాఫీస్ వార్ కోసం ఫైట్ చేస్తుంటే… ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ తమ గ్రాండ్ రీఎంట్రీ కోసం ఫైట్ చేస్తున్నారు. అత్తారింటికి దారేది సినిమాతో నదియాని, అజ్ఞాతవాసి సినిమాతో ఖుష్బూని చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకి తెచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, ఈసారి అల్లు అర్జున్ కోసం టబుని తీసుకువచ్చాడు. అల వైకుంఠపురములో సినిమాలో టబు, బన్నీకి అమ్మగా నటిస్తోంది. ఒకప్పుడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసిన టబు, పాండురంగడు సినిమా తర్వాత మళ్లీ మన ప్రేక్షకుల ముందు కనిపించలేదు.

దాదాపు 11 ఏళ్ల తర్వాత టబు రీఎంట్రీ గ్రాండ్ గా ఇవ్వాలని చూస్తుంటే, లేడీ సూపర్ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. 14 ఏళ్ల క్రితం వచ్చిన నాయుడమ్మ సినిమా తర్వాత రాజకీయాల్లో బిజీ అయిన విజయశాంతి, ఇన్నేళ్ల తర్వాత మహేశ్ సినిమాలో నటిస్తోంది. అనీల్ రావిపూడి సినిమాలో పవర్ఫుల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న విజయశాంతి, ఒకప్పటి స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులని మెప్పించాలని చూస్తోంది. ఈ ఇద్దరు నటిస్తున్న సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి, మరి ఈ రీఎంట్రీని గ్రాండ్ గా ఎవరు సెలెబ్రేట్ చేసుకుంటారో చూడాలి.