ప్రకాష్ రాజ్ సిని’మా’ బిడ్డల ప్యానెల్

సెప్టెంబర్ లో జరగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేడి రెండు నెలల ముందే ప్రారంభం అయ్యింది. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, హేమ మధ్యన జరగనున్న ఈ రసవత్తర పోరులో ఒక అడుగు ముందుకి వేసి ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ మెంబర్స్ ఎవరో అనౌన్స్ చేశాడు. ప్రకాష్ రాజ్ సిని ‘మా’ బిడ్డల ప్యానెల్ లో ఉన్న 27 మంది సభ్యులు ఎవరో, ఈ పేర్లు చెప్తూ ప్రకాష్ రాజ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో ఒకసారి చూద్దాం.

సిని’మా’ బిడ్డ‌లం
మ‌న‌కోసం మ‌నం
‘మా’ కోసం మ‌నం

త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే MAA ఎల‌క్ష‌న్స్‌ని పుర‌స్క‌రించుకుని, ‘మా’ శ్రేయ‌స్సు దృష్ట్యా.. నిర్మాణాత్మ‌క ఆలోచ‌న‌ల‌ని ఆచ‌ర‌ణ‌లో పెట్టే దిశ‌గా మా ప్ర‌తిష్ట‌కోసం.. మ‌న న‌టీ నటుల బాగోగుల కోసం.. సినిమా న‌టీన‌టులంద‌రి ఆశీస్సుల‌తో.. అండ‌దండ‌ల‌తో.. ఎన్నిక‌ల‌లో నిల‌బ‌డటం కోసం.. ప‌ద‌వులు కాదు ప‌నులు మాత్ర‌మే చేయ‌డం కోసం.. ‘మా’ టీంతో రాబోతున్న విష‌యాన్ని తెలియ‌ప‌రుస్తున్నాం.

ప్ర‌కాష్‌రాజ్ గారి ప్యానెల్
సిని ‘మా’ బిడ్డ‌లు

  1. ప్ర‌కాష్‌రాజ్‌
  2. జ‌య‌సుధ‌
  3. శ్రీకాంత్‌
  4. బెన‌ర్జీ
  5. సాయికుమార్‌
  6. తనీష్‌
  7. ప్ర‌గ‌తి
  8. అన‌సూయ‌
  9. స‌న
  10. అనిత చౌద‌రి
  11. సుధ‌
  12. అజ‌య్‌
  13. నాగినీడు
  14. బ్ర‌హ్మాజీ
  15. ర‌విప్ర‌కాష్‌
  16. స‌మీర్‌
  17. ఉత్తేజ్
  18. బండ్ల గణేష్
  19. ఏడిద శ్రీరామ్‌
  20. శివారెడ్డి
  21. భూపాల్‌
  22. టార్జ‌ాన్‌
  23. సురేష్ కొండేటి
  24. ఖ‌య్యుం
  25. సుడిగాలి సుధీర్
  26. గోవింద‌రావు
  27. శ్రీధ‌ర్‌రావు

& మ‌రికొంద‌రు ప్ర‌ముఖుల‌తో…

నమస్సులతో

  మీ 

ప్రకాష్ రాజ్.

అంటూ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ మెంబర్స్ ని ప్రకటించాడు. మరి మంచు విష్ణు ప్యానెల్ లో ఎవరు ఉన్నారు అనేది తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.