Gopichand: క‌బ‌డ్డీ క‌బ‌డ్డీ సీటీమార్ అంటూ గోపీచంద్ ఈల కొడుతున్నాడు..

Gopichand: టాలీవుడ్ యాక్ష‌న్ హీరో గోపీచంద్ న‌టిస్తున్న తాజా చిత్రం సీటీమార్‌. ఈ చిత్రానికి సంప‌త్‌నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.. కొన్నేళ్లుగా వ‌రుస ప‌రాజ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న గోపీచంద్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలి అనే త‌ప‌న ఈ సినిమాకు సంబంధించి పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్ చూస్తే తెలుస్తోంది. క‌బ‌డ్డీ క‌థాంశంతో ఈ చిత్రం తెర‌కెక్కుతుండ‌గా.. ఇటీవ‌లే ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌లై.. ఒక్క‌సారిగా ఈ సినిమాపై అంచనాల‌ను పెంచేసింది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఈ మేర‌కు స‌మంత అక్కినేనితో ఈ సాంగ్‌ను రిలీజ్ చేయించారు చిత్ర‌బృందం.

Gopichand Movie

క‌బ‌డ్డీ క‌బ‌డ్డీ.. సీటీమార్ సీటీమార్ అంటూ సాగే ఈ సాంగ్‌లో Gopichandగోపీచంద్ వైవిధ్య‌మైన స్టెప్స్ వేశారు. ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతం అందించ‌గా.. కాస‌ర్ల శ్యామ్ లిరిక్స్‌తో అనురాగ్ కుల‌క‌ర్ణీ, రేవంత్ వ‌రంలు ఈ సాంగ్‌ను ఆల‌పించారు.ఈ పాట‌లో మ్యూజిక్‌తో పాటు సింగిల్‌.. పిక్చ‌రైజేష‌న్ ఎంతో బాగుంది.. ప్ర‌స్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో న‌డుస్తోంది. ఇక ఈ చిత్రంలో మిల్క్‌బ్యూటీ త‌మ‌న్నా మ‌హిళా ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో న‌టిస్తుంది. అలాగే ప్ర‌ముఖ న‌టి భూమిక చావ్లా ఓ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్ర్కీన్స్ బ్యాన‌ర్‌పై శ్రీ‌నివాసా చిట్టూరి నిర్మిస్తుండ‌గా.. ఏప్రిల్ 2న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.