మేము మంచి కిడ్నాపర్లo అంటున్న “శీను-వేణు” చిత్రం ‘ఊర్వశి ఓటిటి’ ద్వారా విడుదల!!

కిడ్నాప్ నేపథ్యంలో లవ్, యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్ కలగలసి హిలేరియస్ ఎంటర్టైనర్ గా రూపొందిన చిత్రం “శీను-వేణు”. ‘వీళ్లు మంచి కిడ్నాపర్లు” అన్నది ట్యాగ్ లైన్. వసుంధర క్రియేషన్స్ పతాకంపై.. బహుముఖ ప్రతిభాశాలి ‘రవి ములకలపల్లి’ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహించడంతోపాటు… సంగీతం, స్టోరీ, స్క్రీన్ సమకూర్చారు.


అభిషేక్ కన్నెళూర్, ప్రజ్వల కుమార్, మధుప్రియ (మగువ ఫేమ్), పూజిత హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 25న ఊర్వశి ఓటిటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రేక్షకులను ఆలరించేందుకు అన్ని సన్నాహాలు చేసుకుంటోంది.


దర్శకనిర్మాత రవి ములకలపల్లి మాట్లాడుతూ… “నవరసాలు సమపాళ్ళలో మేళవించి రూపొందించిన చిత్రమిది. దర్శకనిర్మాతగా నాతోపాటు… ఇందులో నటించిన, ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరు తెచ్చే చిత్రమిది. మా చిత్రాన్ని ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువారందరికీ ఈనెల 25 నుంచి ఊర్వశి ఓటిటి చేరువ చేస్తుండడం చాలా సంతోషంగా ఉంది” అన్నారు.
జీవా, భాస్కర్, చిత్రం శ్రీను, సుమన్ శెట్టి, అంజి, శ్రీధర్ కుమార్, నాగేశ్వరావు, సుజాత, లలిత, రాక్ వేణు, చిట్టి ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: ఎమ్.ఎన్.ఆర్., కెమెరా: ఆర్యన్,
కథ-మాటలు-సంగీతం-స్క్రీన్ ప్లే-నిర్మాణం-దర్శకత్వం: రవి ములకలపల్లి!!