SBSB కలెక్షన్స్ ఎంతో తెలుసా?

లాక్‌డౌన్ తర్వాత విడుదల అయిన తొలి సినిమా సాయిధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను మూటకట్టుకున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ తర్వాత కరోనా ప్రభావం క్రమంలో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా?.. లేదా? అనే అనుమాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో సోలో బ్రతుకే సో బెటర్ సినిమా యూనిట్ ధైర్యంగా ముందుకొచ్చి సాహసంతో సినిమా విడుదల చేసింది.

తాజాగా ఈ సినిమా కలెక్షన్ల విషయాలు బయటికొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.12 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. రూ.10 కోట్లకు థియేట్రికల్ హక్కులు అమ్ముడవ్వగా.. సినిమా దానికిపైగా కలెక్షన్లు సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి మొత్తంగా సోలో మూవీ రూ.11.30 కోట్లు వసూల్ చేయగా.. ఓవర్సీస్ కలెక్షన్స్ కోటి పదిలక్షలు వసూల్ చేసింది. మొత్తానికి సోలో మూవీ 12.40 కోట్లు రాబట్టింది.