చిరు సినిమాలో మరో టాలీవుడ్ హీరో

ఒక హీరో సినిమాలో మరో హీరో నటించడం ప్రస్తుత కాలంలో కామన్‌గా మారిపోయింది. ఒక హీరో సినిమాలో మరో హీరో నటిస్తే అది సినిమాకు ప్లాస్ అవుతుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలను ఇష్టపడుతున్నారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువైపోతున్నాయి. ప్రస్తుతం రాంచరణ్, ఎన్టీఆర్‌లతో రాజమౌళి RRR సినిమా తీస్తుండగా.. F3లో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.

SATYADEV IN CHIRU CINEMA
SATYADEV IN CHIRU CINEMA

ఇప్పుడు చిరు సినిమాలో ఒక హీరో నటించనున్నాడనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఆచార్య సినిమాలో చిరు నటిస్తున్నాడు. దీని షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఇందులో చిరు సరసన కాజల్ నటిస్తుండగా.. రాంచరణ్ ఇందులో కీలక పాత్రలలో నటించనున్నాడు. వచ్చే సమ్మర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

దీని తర్వాత మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమా తెలుగులోకి రీమేక్ కానుండగా.. ఇందులో చిరు హీరోగా నటించనున్నాడు. దీనికి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో కీలక పాత్రలో టాలీవుడ్ హీరో సత్యదేవ్ నటిస్తాడని సమాచారం. ఇప్పటికే సినిమా యూనిట్ సత్యదేవ్‌ను సంప్రదించగా.. ఇందులో నటించేందుకు అతడు కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.