నాలుగేళ్ల తర్వాత.. జైలు నుంచి శశికళ విడుదల

అక్రమాస్తుల కేసులో నాలుగేళ్లు జైలుశిక్ష అనుభవించిన తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ ఇవాళ జైలు నుంచి విడుదలైంది. ఈ నెల 20న కరోనా బారిన పడటంతో.. బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్‌లో ఆమెను జైలు అధికారులు చేర్చారు. దీంతో జైలు అధికారులు హాస్పిటల్‌లోనే విడుదల ప్రక్రియను పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె కరోనా నుంచి కోలుకోగా.. ఆస్పత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జి అవుతారనేది ఇంకా కన్పామ్ కాలేదు.

sasikala released from jail

వైద్యులు డిశ్చార్జి చేసిన తర్వాత బెంగళూరు నుంచి చెన్నైకి శశికళ చేరుకోనున్నారు. దీంతో శిశికళకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఆమె వర్గీయులు ఏర్పాట్లు చేశారు. వెయ్యి వాహనాలతో ఆమెకు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగనున్న క్రమంలో శశికళ జైలు నుంచి విడుదల కావడంతో.. తమిళ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. త్వరలో జరగనున్న ఎన్నికల్లో శశికళ ఎలాంటి పాత్ర పోషిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే శశికళ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అన్నాడీఎంకేలో తిరిగి చేర్చుకుంటామని ఇటీవల తమిళనాడు సీఎం పళనిస్వామి వ్యాఖ్యానించారు.