Superstar: మ‌హేశ్ పిక్‌తో స‌ర్కార్‌వారి పాట మ‌రో అప్‌డేట్‌..

Superstar: సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్కార్ వారి పాట‌. ఈ చిత్రానికి గీతాగోవిందం ఫేం డైరెక్ట‌ర్ ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. మైత్రీమూవీ మేక‌ర్స్, 14రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, జీఎంబీ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇందులో మ‌హేశ్ స‌ర‌స‌న కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం Superstarమ‌హేశ్ అభిమానులు ఎంతాగానో ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ చిత్రానికి సంబంధించి అప్‌డేట్స్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు మ‌హేశ్ ఫ్యాన్స్‌. కాగా ఈ చిత్రం షూటింగ్ మొద‌టి షెడ్యూల్ కోసం గ‌త నెల దుబాయ్‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే.

కాగా ఇటీవ‌లే దుబాయ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా ఈ విష‌యాన్ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స‌ర్కార్ వారి పాట అప్‌డేట్ ఇచ్చాడు. స‌క్సెస్‌ఫుల్‌గా ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్త‌యింద‌ని.. కొవిడ్ నేప‌థ్యంలో ప్రొడ్యూస‌ర్స్ ఈ సినిమా షెడ్యూల్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నార‌ని పేర్కొన్నాడు. ఈ మేర‌కు Superstarమ‌హేశ్‌బాబుకు సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేశాడు త‌మ‌న్‌. ఇందులో మ‌హేశ్‌బాబు బ్యాక్ సైడ్ వ్యూలో ఫేస్‌కు క్లాత్ క‌ట్టుకుని ఉన్నాడు. ఇక దుబాయ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న చిత్ర‌బృందం హైద‌రాబాద్ చేరుకుంది. త్వ‌ర‌లోనే గోవాలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. ఇక ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.