సరిలేరు నీకెవ్వరూ టీజర్ డేట్ అన్లాక్ చేశారు…

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రొమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్, టీజర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. నిజానికి సరిలేరు నీకెవ్వరూ టీజర్ ని నవంబర్ 23న డైరెక్టర్ అనీల్ రావిపూడి పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేస్తారని అంతా అనుకున్నారు. అయితే అనుకున్న దానికన్నా ముందే మహేశ్ బాబు రానున్నాడు. అన్లాక్ ది టీజర్ అంటూ కొత్తగా ప్రమోట్ చేసిన చిత్ర యూనిట్, సరిలేరు నీకెవ్వరూ టీజర్ ని నవంబర్ 22 సాయంత్రం 5:04 నిమిషాలకి రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన మహేశ్ స్పెషల్ వీడియో ఆకట్టుకుంటుంది. దిల్ రాజు, ఏకే ఎంటర్టైన్మెంట్స్, మహేశ్ బాబు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ మూవీలో మహేష్ పక్కన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.

sarileru neekevvaru teaser release date

మహేశ్ బాబు 26వ సినిమా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరూ సినిమాకి లేడీ అమితాబ్ విజయశాంతి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. టీచర్ గా కనిపించనున్న విజయశాంతి, మహేశ్ బాబు మధ్య సీన్స్ సూపర్బ్ గా ఉంటాయని సమాచారం. రిలీజ్ ఇంకా 50 రోజుల దాకా టైం ఉంది కాబట్టి ఈ లోపు 22న సరిలేరు నీకెవ్వరూ టీజర్ ని చూసి ఎంజాయ్ చేయండి.