మొగుడు ఇకపై ప్రతి మండే వస్తాడు…

సరిలేరు నీకెవ్వరూ టీజర్ తో మెప్పించిన మహేశ్ ఇకపై ప్రతి సోమవారం యూట్యూబ్ ని లెక్కలు సరిచేయడానికి రాబోతున్నాడు. ఇప్పటి నుంచి జనవరి 11 వరకూ అయిదు సోమవారాలు ఉన్నాయి. ప్రతి మండే మాస్ మహేశ్ బాబు అంటూ సరిలేరు నీకెవ్వరూ నుంచి సాంగ్స్ బయటకి రానున్నాయి. దేవి మ్యూజిక్ ఇచ్చిన ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి సాంగ్ చార్ట్ బస్టర్ అవుతుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉంది.

మహేశ్ అండ్ దేవి శ్రీప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన 1 నేనొక్కడినే, భరత్ అనే నేను, మహర్షి సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. అయితే ఇవన్నీ క్లాస్ సినిమాలు కావడంతో దేవి, మహేశ్ కి క్లాస్ సాంగ్స్ ఇచ్చాడు. సరిలేరు నీకెవ్వరూ సినిమా మాస్ మసాలా సినిమా కాబట్టి అదిరిపోయే సాంగ్స్ ఇస్తానని దేవి శ్రీ ప్రసాద్ దర్శక నిర్మాతలకి మాటిచ్చాడట. ఈ విషయాన్ని స్వయంగా తెలిపిన చిత్ర యూనిట్, దేవి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు… సరిలేరు నీకెవ్వరూ సినిమాకి అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చాడు అంటున్నారు. మరి మహేశ్ కోసం దేవి చేసిన మ్యాజిక్ ఏంటో తెలియాలి అంటే సోమవారం వరకూ ఆగాల్సిందే.