మహేశ్ మాస్ ని రీడిఫైన్ చేస్తున్నాడు

సూపర్ స్టార్ మహేశ్ బాబు, అనీల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు. ఇందులో మేజర్ అజయ్ పాత్రలో కనిపించనున్న మహేశ్, కెరీర్ లో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి చిన్న గ్లిమ్ప్స్ బయటకి వచ్చి ఘట్టమనేని అభిమానులకి కొత్త కిక్ ఇచ్చింది. మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా, ఇండిపెండెన్స్ డేకి రిలీజ్ చేసిన పోస్టర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. వీటిని తలదన్నేలా దసరా కానుకగా సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి కొత్త పోస్టర్ బయటకి వచ్చింది.

sarileru neekevvaru mass action poster

గత కొంతకాలంగా మహేశ్ ని డీసెంట్ రోల్స్ లో మాత్రానే చూస్తున్న ఘట్టమనేని అభిమానులకి ఈ పోస్టర్ ఫుల్ మీల్స్ పెట్టింది. ఒక స్టార్ హీరో దొరికితే ఏ రేంజులో వాడుకుంటానో చూపించిన అనీల్ రావిపూడి, సరిలేరు నీకెవ్వరు కొత్త పోస్టర్ ని అభిమానులకి ఎలా కావాలో, వాళ్లు మహేశ్ ని ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించాడు. కొండారెడ్డి బురుజు దగ్గర గొడ్డలి పట్టుకోని నిలబడిన మహేశ్ పోస్టర్ ఊరమాస్ అసలు. బ్లాక్ షర్ట్ లో, ఆర్మీ ప్యాంటులో మహేశ్ మాస్ ని రీడిఫైన్ చేస్తున్నాడు. ఇప్పటి వరకూ సరిలేరు నీకెవ్వరు సినిమాని చూసిన విధానం, ఊహించుకున్న విధానం వేరు… ఈ కొత్త పోస్టర్ సరిలేరు నీకెవ్వరు సినిమాని చూపించిన విధానం వేరు. ఇది కనుక సరిలేరు నీకెవ్వరు ఇంటర్వెల్ ఫైట్ అయితే మాత్రం థియేటర్స్ లో గాల్లోకి పేపర్లు ఎగరడం, విజిల్స్ తో థియేటర్ల టాప్ లేచిపోవడం ఖాయం. నిజానికి కొండారెడ్డి బురుజుకి, మహేశ్ కి ఎక్కడో తెలియని కనెక్షన్ ఉన్నట్లుంది. ఒక్కడు సినిమాలో మహేశ్ ఒక్క డైలాగ్ చెప్పకుండా అలా నిలబడితేనే ఇండస్ట్రీ హిట్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా గొడ్డలి పట్టుకోని నిలబడ్డాడు, ఈసారి ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Read: దీపావళికి సరిలేరు నీకెవ్వరు టీజర్ రిలీజ్