అంగరంగ వైభవంగా ‘సారంగపాణి జాతకం’ సక్సెస్ మీట్‌

సెన్సిబుల్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ సక్సెస్ ఫుల్ కాంబోలో వచ్చిన మూడో చిత్రం ‘సారంగపాణి జాతకం’. శ్రీదేవీ మూవీస్ బ్యానర్ మీద నిర్మించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, రూపా కొడవయూర్ జంటగా నటించారు. ఏప్రిల్ 25న విడుదలైన ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ఆదివారం (ఏప్రిల్ 27) నాడు ‘ఫన్’టాస్టిక్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో

ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ .. ‘శివలెంక కృష్ణ ప్రసాద్ గారితో నేను ఇది వరకు ‘సమ్మోహనం’, ‘జెంటిల్ మెన్’ చిత్రాలు చేశాను. ఇప్పుడు ‘సారంగపాణి జాతకం’ చేశాం. ఈ మూడు చిత్రాలు కూడా గొప్పవే. ప్రేక్షకులు పది కాలాల పాటు గుర్తు పెట్టుకునే సినిమాలు మా కాంబినేషన్‌లో వచ్చాయి. ఓ దర్శకుడిని ఇంతగా నమ్మి, స్వేచ్చనిచ్చే నిర్మాతలు ఇప్పుడు కరువవుతున్నారు. మేం ఈ చిత్రాన్ని ఎంతో ప్రేమించి చేశాం. ఇప్పుడు ఆడియెన్స్ ముందుకు వచ్చింది.. మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఫ్యామిలీస్ ఇప్పుడిప్పుడే థియేటర్లకు వస్తున్నారు. ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రియదర్శి ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. నేను అనుకున్న దాని కంటే వెయ్యి రేట్లు ఎక్కువగా నటించారు. వైవా షార్ట్ ఫిల్మ్‌ను మా ఇంట్లో ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. మంత్ ఆఫ్ మధు చూసిన తరువాత హర్షను మరింత వాడుకోవాలని అనుకున్నాను. హర్ష సత్తాను ఎంతో కొంత బయటకు తీసుకు వచ్చానని అనిపిస్తోంది. అశోక్ గారు చిన్న పాత్రే అయినా అద్భుతంగా నటించారు. నివిత కూడా చక్కగా నటించారు. రూపా అద్భుతమైన నటి. తెలుగు కళాకారిణిలో ఆమె ఓ గొప్ప నటిగా ఎదుగుతారు. వివేక్ సాగర్, మార్తాండ్ కే వెంకటేష్, విందా, ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ అందరూ అద్భుతంగా పని చేశారు. రామజోగయ్య శాస్త్రి గారు నాలుగు అద్భుతమైన పాటలు రాశారు. ఈ చిత్రానికి నా సీక్రెట్ హీరో సురేష్. నా డైరెక్షన్ టీం ఎంతో అండగా నిలబడింది. అచ్చమైన తెలుగు నటులు నటించిన తెలుగు సినిమాను అందించాం. ఇది నా కెరీర్‌లో స్పెషల్ మూవీ కానుంది. ఈ చిత్రాన్ని తీసే క్రమంలో తోడ్పడిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ మూవీని ఇంతలా ఆదరిస్తున్న మీడియాకి, ఆడియెన్స్‌కి నా ధన్యవాదాలు’ అని అన్నారు.

ప్రియదర్శి మాట్లాడుతూ .. ‘‘సారంగపాణి జాతకం’ సినిమాకు శనివారం నాడు సెలెబ్రిటీ షో వేశాం. ఆడియెన్స్, సెలెబ్రిటీలు అందరూ సినిమాను ఎంజాయ్ చేశారు. ‘సారంగపాణి జాతకం’ టీంతో పని చేయడం నా అదృష్టం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నా గురువు ఇంద్రగంటి మోహనకృష్ణ గారికి థాంక్స్. ఇలాంటి గొప్ప సినిమాలను గత 30 ఏళ్లు నిర్మిస్తూ ఉన్న నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గారికి థాంక్స్. గొప్ప చిత్రాల లిస్ట్‌లో శివలెంక కృష్ణ ప్రసాద్ గారి పేరు.. ఆయన తీసిన సినిమాల పేర్లు ఉంటాయి.. అందులో ఎక్కడో చోట నా పేరు కూడా ఉంటుందని గర్వంగా ఉంది. పీజీ విందా గారు నన్ను అందంగా చూపించారు. నేను ఈ సినిమాలో బాగున్నానని మా అమ్మ కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు. మార్తాండ్ కే వెంకటేష్ గారు మాకు ఎన్నో సలహాలు ఇచ్చారు. వివేక్ సాగర్ సంగీతం, రవిందర్ గారి ఆర్ట్ వర్క్ అద్భుతంగా ఉంది. కోట సురేష్ గారు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్, అశ్విన్ నన్ను చక్కగా చూపించారు. రామ జోగయ్య శాస్త్రి గారు మంచి పాటల్ని ఇచ్చారు. రూప అద్భుతంగా నటించారు. ఆమె చాలా గొప్ప నటి. ఆమె బాగుంది కాబట్టే.. నేను కూడా బాగున్నాను. వెన్నెల కిషోర్, వైవా హర్షలతో మళ్లీ కలిసి పని చేయాలని ఉంది. మా కోసం మళ్లీ సీక్వెల్ రాయండి (నవ్వుతూ). శ్రీనివాస్ అవసరాల అద్భుతమైన నటులు. ఆయన దర్శకత్వంలోనూ నటించాలని ఉంది. నరేష్ గారు, కల్పలత గారు, రూపా లక్ష్మీ గారు, వడ్లమాని శ్రీనివాస్ గారు అద్భుతంగా నటించారు. మాకు అండగా నిలిచిన డైరెక్షన్ టీంకు థాంక్స్. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. మాకు ఇంతగా సపోర్ట్ చేసిన మీడియాకు థాంక్స్. కోర్ట్ తరువాత మళ్లీ అందమైన ‘సారంగపాణి జాతకం’ ఓ వరంలా దొరికింది. ఇంత చిత్రంతో రావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ .. ‘‘సారంగపాణి జాతకం’ సినిమాను ఆదరిస్తున్న మీడియాకి, ప్రేక్షకులకు థాంక్స్. ఈ చిత్రాన్ని ఎంతో కష్టపడి, ఇష్టపడి చేశాం. సినిమాకు మంచి టాక్ వస్తోంది. ఫుల్ ఫాల్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ సినిమాను థియేటర్లో ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సినిమాను చూస్తే వచ్చే కిక్కు వేరేలా ఉంటుంది. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ముందుకు వచ్చి మా సినిమాను రిలీజ్ చేశాయి. నన్ను నమ్మి ముందుకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ చిత్రం మున్ముందు మరింత పెద్ద విజయాన్ని సాధిస్తుందని నమ్మకంగా ఉంది. ఇంద్రగంటి గారితో ఇది వరకు సమ్మోహనం, జెంటిల్ మెన్ తీసి సక్సెస్ కొట్టాను. ఇప్పుడు హాట్రిక్ హిట్‌గా ‘సారంపాణి జాతకం’ నిలిచింది. మా సినిమా టీజర్‌ను రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండకి, ట్రైలర్ రిలీజ్ చేసిన నానికి, సినిమా విడుదల తర్వాత ఫోన్ చేసి అభినందించిన సాయి ధరమ్ తేజ్, శ్రీ విష్ణులకు థాంక్స్. ప్రతీ ఒక్కరూ ఈ సమ్మర్‌లో మా సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ’ అని అన్నారు.

రూపా కొడవయూర్ మాట్లాడుతూ .. ‘‘సారంగపాణి’ చిత్రంలో అందరూ సీనియర్ యాక్టర్లే ఉన్నారు. ఇలాంటి వారందరితో కలిసి పని చేసే అదృష్టం నాకు వచ్చింది. ఇంద్రగంటి గారి డైరెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. నా కల నెరవేరినట్టుగా అనిపిస్తోంది. సెట్‌లో ఇంద్రగంటి గారు అందరినీ ఎంతో గౌరవంగా, ప్రేమగా చూసుకుంటారు. ‘సారంగపాణి జాతకం’ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మైథిలీ పాత్రతో అందరూ కనెక్ట్ అవుతున్నారు. నాకెంతో సంతోషంగా ఉంది. విందా గారు చాలా కూలెస్ట్ కెమెరామెన్. దర్శితో నటించడం ఆనందంగా ఉంది. వెన్నెల కిషోర్ సర్, వైవా హర్ష గారి కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మా సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ .. ‘ఇంద్రగంటి గారు మంచి రచయిత, దర్శకులు. చాలా రోజుల తరువాత అందరూ పగలబడి నవ్వుకుంటున్నారు. దర్శి ఆల్ రౌండర్ నటుడు. రూపా అద్భుతంగా నటించారు. వెన్నెల కిషోర్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు థియేటర్లో అరుపులే. హర్ష నటన అంటే నాకు చాలా ఇష్టం. విందా గారితో నేను ఎక్కువ సినిమాలు చేశాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన కృష్ణ ప్రసాద్ గారికి థాంక్స్. ఆయనతో నా జర్నీ మర్చిపోలేనిది’ అని అన్నారు.

వెన్నెల కిషోర్ మాట్లాడుతూ .. ‘‘సారంగపాణి జాతకం’ చూసిన వారంతా ఫోన్‌లు, మెసెజ్‌లు చేస్తున్నారు. ఇంద్రగంటి గారితో పని చేయడం ఆనందంగా ఉంది. అసలు ఇంద్రగంటి గారితో పని చేస్తే చాలు.. రిజల్ట్‌తో పని అవసరం లేదు. దర్శికి మంచి జడ్జ్‌మెంట్ ఉంది. అప్పట్లో ఆమిర్ ఖాన్ గారికి ఇలాంటి జడ్జ్ మెంట్ ఉండేది. దర్శితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. ఇంద్రగంటి గారి సినిమా అంటే కారెక్టర్ అడగకుండా చేసేయాలి.. దర్శి సినిమా అంటే డేట్స్ అడగకుండా చేసేయాలి. శివలెంక గారి సినిమా అంటే కళ్లు మూసుకుని చేసేయాలి’ అని అన్నారు.

వైవా హర్ష మాట్లాడుతూ .. ‘‘సారంగపాణి జాతకం’లో అందరూ అద్బుతంగా నటించారు. సెకండాఫ్‌లో నన్ను దించారు. ఇంద్రగంటి గారితో పని చేయడం మా అదృష్టం. ఈ చిత్రంతో నాకు వెన్నెల కిషోర్ అన్న ఎక్కువగా క్లోజ్ అయ్యారు. దర్శి, రూపా స్క్రీన్ పై చక్కగా కనిపించారు. దర్శి కంటిన్యూగా హిట్లు కొడుతూనే ఉన్నారు. కృష్ణ ప్రసాద్ గారి నుంచి ఇలాంటి ఇంకా మంచి చిత్రాలెన్నో రావాలి’ అని అన్నారు.

కెమెరామెన్ పీజీ విందా మాట్లాడుతూ .. ‘‘సారంగపాణి జాతకం’ చిత్రానికి అంతా తెలుగు వాళ్లే నటించారు. నటీనటులు, సాంకేతిక బృందం ఇలా అందరూ తెలుగువాళ్లే. ఇందులో పద ప్రయోగం, హాస్య ప్రయోగం అన్నీ అద్భుతంగా ఉంటాయి. ప్రతీ సీన్, ప్రతీ డైలాగ్‌కు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మాటలు అద్భుతంగా కుదిరాయి. ఈ మూవీని అందరూ తప్పకుండా చూడాలి. తెలుగు వాళ్లు కచ్చితంగా చూడాల్సిన చిత్రమిది. అందరూ చూసి హాయిగా నవ్వుకోండి’ అని అన్నారు.