Love Story: ల‌క్ష లైక్స్‌తో దుమ్ముదులిపేసిన సారంగ‌ద‌రియా..

Love Story: నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్లవి జంట‌గా ల‌వ్‌స్టోరీ చిత్రం తెర‌కెక్కుతుందనే విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా ఈ చిత్రంలోని సారంగ‌ద‌రియా సాంగ్ యూట్యూబ్‌లో విడుద‌లైన‌ప్ప‌టినుంచి రికార్డు సృష్టిస్తుంద‌నే ఉంది. ఇప్పుడు తాజాగా 1మిలియ‌న్ లైక్స్ సొంతం చేసుకున్న తొలి తెలుగు పాట‌గా నిలిచింది.

sarangadhariya

ఇప్ప‌టి వ‌ర‌కు 90మిలియ‌న్ల‌కి పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక ఈ సాంగ్‌కు సాయిప‌ల్ల‌వి డ్యాన్స్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది.. ఈ సాంగ్‌కు సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించ‌గా.. మంగ్లీ ఆల‌పించింది. ఈ చిత్రానికి ప‌వ‌న్ సి.హెచ్ స్వరాలు అందించారు. ఇక ఈ చిత్రాన్ని నారాయ‌ణ‌దాస్ నారంగ్‌, పి. రామ్మోహ‌న్‌రావు నిర్మిస్తుండ‌గా.. ఏప్రిల్ 16న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.