Lovestory: సారంగ‌ద‌రియా అంటూ టాప్ లేపిన సాయిప‌ల్లవి..

Lovestory: ప్ర‌ముఖ టాలీవుడ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో.. నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా ల‌వ్‌స్టోరి చిత్రం తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలోని సారంగ‌ద‌రియా అనే సాంగ్‌ను రిలీజ్ చేయ‌గా.. ప్రేక్ష‌కుల‌ను, సంగీత ప్రియుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది. ఈ సాంగ్‌ను ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించ‌గా.. మంగ్లీ ఆల‌పించింది. ఈ సాంగ్‌కు టాలెంట‌డ్ హీరోయిన్ సాయిప‌ల్ల‌వి డ్యాన్స్ చేసి ప్రేక్ష‌కుల‌ను ఎంతో అల‌రించింది. ఈ సాంగ్ యూట్యూబ్‌లో మార్మోగిపోతుంది.. ఈ నేప‌థ్యంలో ఈ సాంగ్ తాజాగా మ‌రో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో విడుద‌లైన 32రోజుల్లోనే 100మిలియ‌న్ వ్యూస్ సాధించింది.

ఓ తెలుగు పాట ఇంత త్వ‌ర‌గా ఈ రికార్డును సాధించ‌డం చాలా అరుదైన విష‌యం.. దీంతో అల వైకుంఠ‌పురం చిత్రంలోని బుట్ట‌బొమ్మ, రాముల సాంగ్ పేరిట ఉన్న రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ఇక ఈ సాంగ్‌ను ప‌వ‌న్ సీహెచ్‌క కంపోజ్ చేయ‌గా.. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో సాయిప‌ల్ల‌వి ఓ ర‌కంగా నెమ‌లి నాట్యం చేసింద‌ని చెప్ప‌వ‌చ్చు. మొత్తానికి సారంగ‌ద‌రియా సాంగ్‌ ఈ సినిమాకు ప్ల‌స్ అవుతుంద‌నే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 16న థియేట‌ర్ల‌లోకి రానుంది.