సారంగ‌ద‌రియా వివాదం క్లియ‌ర్‌.. నెక్ట్స్ మూవీలో కోమ‌లికి అవకాశం ఇస్తా: డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కిస్తున్న చిత్రం ల‌వ్‌స్టోరి. ఇందులో నాగ‌చైత‌న్య‌కు జోడీగా సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. స‌రికొత్త ల‌వ్‌స్టోరీ క‌థాంశంతో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. కాగా ఇందులో జాన‌ప‌ద సారంగ‌ద‌రియా సాంగ్‌ను పెట్టుకున్నారు. దీంట్లో సాయిప‌ల్ల‌వి డ్యాన్స్ ఎంతో అద్భుతంగా అల‌రించింది. అలాగే సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించ‌గా.. ప్ర‌ముఖ సింగ‌ర్ మంగ్లీ ఈ సాంగ్‌ను ఆల‌పించింది. ఈ పాట ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో హావా చేస్తోంది. కాగా ఈ జాన‌ప‌ద సారంగ‌ద‌రియా పాట‌ను సేక‌రించిన ఫోక్ సింగ‌ర్ కోమ‌లి అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. దీంతో ఈ పాట విష‌యంలో వివాద‌స్ప‌ద‌మైంది. ఇక తాజాగా ఈ విష‌యంపై కోమ‌లి శేఖ‌ర్ క‌మ్ముల‌ను నేరుగా క‌లుసుకుని.. వీరిద్ద‌రు చ‌ర్చించుకున్నారు. అనంత‌రం కోమ‌లి మాట్లాడుతూ..

saranga

సారంగ‌ద‌రియా పాట ల‌వ్‌స్టోరీ సినిమాలో నాతో పాడించ‌లేద‌నే బాధ ఇన్ని రోజులు ఉండేద‌ని.. అదే ఆరాటాన్ని మీడియా ద్వారా వ్య‌క్తం చేశాను. ఇవాళ డైరెక్ట‌ర్ సురేశ్ గారి చొర‌వ‌తో ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల గారిని క‌లిశాన‌ని.. అందుకు సంతోషంగా ఉంద‌ని చెప్పుకొచ్చింది. ఆయ‌న త‌న రాబోయే సినిమాల్లో అవ‌కాశం ఉంటే త‌ప్ప‌కుంగా నాతో పాడిస్తాన‌ని మాటిచ్చార‌ని.. ల‌వ్‌స్టోరి ఆడియో ఫంక్ష‌న్‌లో స్టేజ్ మీద సారంగ‌ద‌రియా సాంగ్‌ను నాతోనే పాడిస్తున్నార‌ని పేర్కొంది. ఇక ఈ సాంగ్ విష‌యంలో ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని కోమ‌లి తెలిపింది. డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల మాట్లాడుతూ.. భ‌విష్య‌త్తులో తాను చేయ‌బోయే సినిమాల్లో జాన‌ప‌ద పాట పాడించే అవ‌కాశం ఉంటే త‌ప్ప‌కుండా కోమ‌లికి పాట పాడే అవ‌కాశం క‌ల్పిస్తాన‌ని తెలిపాడు శేఖ‌ర్ క‌మ్ముల.‌‌