ఆ హీరోయిన్‌తో ఇద్దరు హీరోలు రోమాన్స్

ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్‌లో అక్షయ్ కుమార్, ధనుష్ కలిసి నటిస్తున్న సినిమా ‘అట్రాంగి రే’. ఇందులో సారా అలీ ఖాన్ హీరోయిన్‌గా నటిస్తుండగా. . ఇటీవలే ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దీని షూటింగ్ ప్రారంభమైంది. ఆనంద్‌రాయ్‌తో అక్షయ్ చేస్తున్న తొలి సినిమా ఇదే. ఇక ధనుష్ 2013లో ఆనంద్ రాయ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘రాంజన’ ‘సినిమాలో నటించాడు. ఇందులో సోనమ్ కపూర్, అభయ్ డియోల్ నటించారు.

SARA ALI KHAN

ఇప్పుడు ‘అట్రాంగి రే’ సినిమా షూటింగ్ తాజమహాల్ వద్ద జరుగుతోంది. ఇందులో అక్షయ్, సారా, ధనుష్ పాల్గొనగా.. సారాతో కొన్ని రొమాంటిక్ సీన్లను తెరెకెక్కిస్తున్నారు. డిసెంబర్ చివరినాటికి ఈ సినిమా ముగిసే అవకాశముంది. ఇందులో తొలిసారి డబుల్ రోల్‌లో సారా అలీ ఖాన్ కనిపించనుంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా.. భూషణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు, ఒక స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో నటించడంతో.. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.