సంక్రాంతి పోరులో గెలుపెవరిది?

సంక్రాంతి కానుకగా విజయ్ మాస్టర్, రామ్ పోతినేని రెడ్, బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్, రవితేజ క్రాక్ సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో మాస్టర్ సినిమాకు రూ.100కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇక క్రాక్ సినిమా జనవరి 9న విడుదల అవ్వగా.. ఇప్పటివరకు రూ.24 కోట్ల షేర్ సాధించింది. ఇప్పటికీ రోజుకు రూ.2 కోట్ల షేర్‌ను ఈ సినిమా వసూలు చేస్తోంది. దీంతో ఈ సినిమా సూపర్ హిట్ అయిందని చెప్పవచ్చు.

sankranti movie collections

ఇక ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా వచ్చిన రెడ్ సినిమాకు తొలిరోజు రూ.6.7 కోట్ల కలెక్షన్లు రాగా.. రెండు రోజు దాదాపు రూ.3 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి. ఈ నాలుగు రోజుల్లో రూ.14 కోట్ల వరకు షేర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక అల్లుడు అదుర్స్ సినిమా నాలుగురోజుల్లో రూ.12.25 కోట్ల షేర్ సాధించింది.