బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కు క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. గత కొన్ని రోజుల క్రితం కొంత అస్వస్థతకు గురైన సంజయ్ లీలవతి హాస్పిటల్ లో చికిత్స అందుకున్న విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని మొదట వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని వచ్చింది. అయితే ఆయన డిశ్చార్జ్ అయిన కొన్ని గంటలకె మరొక రిపోర్ట్స్ లలో క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది.
రీసెంట్ గా సంజయ్ స్నేహితుడు బాలీవుడ్ హంగామా ఛానెల్ కి ఈ విషయాన్ని చెప్పారు. ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ తో సంజయ్ ఇబ్బంది పడుతున్నారని అయితే చికిత్స కోసం అమెరికాకు వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. ప్రస్తుతం క్యాన్సర్ స్టేజ్ 3లో ఉందని అంటూ ప్రస్తుతం సంజయ్ పిల్లలు తల్లితో దుబాయ్ లో ఉన్నట్లు తెలిపారు. ఇక వారికి ఈ విషయాన్ని తెలియజేయడం ఒక అగ్నిపరీక్ష అని కూడా సంజయ్ మిత్రుడు తెలిపారు.