
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో కథానాయకుడిగా అందరి హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్న యూత్‌ఫుల్ క్రేజీ హీరో సంగీత్ శోభన్ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘గ్యాంబ్లర్స్’. ప్రశాంతి చారులింగా నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కేసీఆర్ ఫేమ్ రాకింగ్ రాకేష్ పృథ్వీరాజ్ బన్న, సాయి శ్వేత, , జస్విక, భరణి శంకర్, మల్హోత్త్ర శివ, శివారెడ్డి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో శ్రీవల్లి అనే సైన్స్ ఫిక్షన్ సినిమాను నిర్మించిన నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్ బృందావనంలు ఈ సినిమాను రేష్మాస్ స్టూడియోస్, స్నాప్ అండ్ క్లాప్ ఎంటర్‌టైన్ మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేఎస్‌కే చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్‌చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ఫస్టలుక్‌ను శుక్రవారం విడుదల చేశారు మేకర్స్.
ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ… ” ఇదొక మిస్టరీ ఎంటర్‌టైనర్. ఈ చిత్రంలో కొత్త సంగీత్ శోభన్‌ను చూడబోతున్నారు. ఆయన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. చిత్రంలో ఉండే థ్రిల్లింగ్ అంశాలు, ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. పూర్తి వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాలను అలరించే అంశాలున్నాయి. ఇటీవల కేసీఆర్ చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న రాకింగ్ రాకేష్ ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రను పోషిస్తున్నాడు. ఆయన పాత్ర కూడా అందర్ని అలరించే విధంగా ఉంది” అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ… ” మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో సంగీత్ శోభన్‌కు యూత్‌లు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నమైన పాత్రను ఆయన ఇందులో చేస్తున్నారు. కొత్తకాన్సెప్ట్‌తో పూర్తి థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన ఈ గ్యాంబ్లర్స్ తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది: అన్నారు.
నటీనటులు : సంగీత్ శోభన్, ప్రశాంతి చారులింగ, రాకింగ్ రాకేష్ పృథ్వీరాజ్ బన్న, సాయి శ్వేత, జస్విక, భరణి శంకర్, మల్హోత్త్ర శివ, శివారెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, మధుసూదన్ రావు, ఛత్రపతి శేఖర్, సూర్య భగవాన్ దాస్ తదితరులు.
నిర్మాతలు: సునీత, రాజ్‌కుమార్ బృందావనం
స్క్రీన్ ప్లే – దర్శకత్వం: KSK చైతన్య
కథ – అదనపు స్క్రీన్‌ప్లే – సంభాషణలు: విజయ్ చిట్నీడి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ ప్రకాష్
సంగీతం: శశాంక్ తిరుపతి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ప్రేమ్ సాగర్
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్
ఎడిటర్: శశాంక్ మాలి
యాక్షన్: వింగ్ చున్ అంజి
కొరియోగ్రఫీ: నిక్సన్ డి’క్రూజ్
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ
కాస్ట్యూమ్ డిజైనర్లు: అశ్వంత్ బైరీ, ప్రతిభా రెడ్డి