హాకీ స్టిక్‌ ప‌ట్టుకుని ఏ1 ఎక్స్‌ప్రెస్‌లో సందీప్‌కిష‌న్‌..

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిష‌న్ ప్ర‌స్థానం సినిమా ద్వారా వెండితెర‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఎన్ని ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేసిన సందీప్‌కు స‌రైన హిట్లు ప‌డ‌డంలేదు. దీంతో వ‌రుస ప్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఆయ‌న ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాల‌న్న క‌సితో ఉన్నాడు. సందీప్‌కిష‌న్ ప్ర‌స్తుతం ఏ1ఎక్స్‌ప్రెస్ సినిమాలో న‌టిస్తుండ‌గా.. హాకీ నేప‌థ్యంలో ఈ క‌థ ఉంటుంద‌ని.. తెలుగులో ఇదే తొలి చిత్ర‌మ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

sandeep kishan

ఇటీవ‌లే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌గా.. తెలుగు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న.. విడుద‌ల తేదీని సందీప్ కిష‌న్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. కుదిరితే ఫిబ్ర‌వ‌రి 12వ తేదీని మార్క్ చేసుకోండి అంటూ అభిమానుల‌కు హింట్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో సందీప్ కిష‌న్ స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాఠీ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్, ద‌యా వ‌న్నెం నిర్మించారు.