ప‌వ‌ర్‌స్టార్‌తో ప్ర‌ముఖ విల‌న్ ఢీ..

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌కీల్‌సాబ్ త‌ర్వాత అయ్య‌ప్ప‌న‌మ్ కోషియం రీమేక్‌లో న‌టించ‌నున్నార‌ని విష‌యం తెలిసిందే. ఈ సినిమాను అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు ఫేం ద‌ర్శ‌కుడు సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అలాగే ఈ సినిమాకు ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌ త్రివిక్ర‌మ్ డైలాగ్స్ అందిస్తుండ‌గా.. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ఎస్ నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

samudrakani

అయితే ఓ కీల‌క‌పాత్ర కోసం జాతీయ అవార్డు గ్ర‌హీత త‌మిళ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని ఈ సినిమాలో న‌టిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ విష‌యంపై ఓ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా.. స‌ముద్ర‌ఖ‌ని తెలుపుతూ.. ఈ సినిమాలో త‌న పాత్ర గురించి త‌న‌కు పెద్ద‌గా తెలియ‌ద‌ని త్రివిక్ర‌మ్ పిలిచి త‌న కోసం మంచి పాత్ర‌ను డిజైన్ చేశాన‌ని చెప్పార‌ని వెల్ల‌డించారు. ఇక ఈ సినిమాలో ప‌వ‌ర్‌స్టార్‌తో పాటు భ‌ళ్లాల‌దేవ రానా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. ఎస్‌.ఎస్‌. థ‌మ‌న్ ఈ సినిమాకు స్వ‌రాలు అందిస్తున్నారు.