“సంశయం ” ట్రైలర్ లాంచ్ చేసిన ప్రముఖ దర్శకుడు YVS చౌదరి

‘తాగుబోతు’రమేష్,అనిరుద్ కస్తూరి ,దివ్య ప్రధాన పాత్రల్లో ,మహేష్ చెంగారెడ్డి దర్శకుడిగా ,నిర్మిస్తున చిత్రం “సంశయం”. ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ దర్శక,నిర్మాత YVS చౌదరి గారు లాంచ్ చేసారు.ఈ సందర్బంగా YVS గారు మాట్లాడుతూ ,”సంశయం” ఒక మంచి తెలుగు టైటిల్ తో డైరెక్టర్ గా పరిచయమవుతున్న మహేష్ చెంగారెడ్డి నాకు మంచి ఫ్రెండ్ .ఇద్దరం చెన్నయ్ లో రూమ్ మేట్స్ .ఆ టైం లో మా మధ్య ఎక్కువగా సినిమా ల గురించి డిస్కషన్ జరిగేది.ఆ డిస్కషన్ లో మహేష్ చాలా జన్యున్ రీజన్స్ చెప్తూ ,తన ఐడియాస్ ని షేర్ చేసుకునేవాడు …ఒక ఆడియన్ పాయింట్ అఫ్ వ్యూ లో ,క్వశ్చన్స్ రేజ్ చేస్తూ మాకు బాగా హెల్ప్ అయ్యేవాడు ..అలాంటి మహేష్ ‘సంశయం’ అనే ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లో ,మన రెగ్యులర్ లైఫ్ లో కనిపించే క్యారెక్టర్స్ ని సినిమా లో చూపించబోతున్నాడు..చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నాను .ట్రైలర్ లోనే ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసి,తను సినిమా లో ఏం చెప్పబోతున్నాడో చాలా క్లారిటీగా ఉన్నాడనిపించింది..NRI’S ని ఆర్టిస్ట్లుగాపెట్టుకుని ,వాళ్ళచేత ఇంత మంచి పెర్ఫార్మన్స్ ని రాబట్టుకొని,చాలా బాగా ఆర్గనైస్ చేసాడు.గొప్ప విషయం ఏంటంటే,ఇందులో ఆర్టిస్ట్ లు అందరూ జాబ్స్ చేసేవాళ్ళే ,వాళ్ళతో ఓన్లీ వీకెండ్స్ లో షూట్ చేస్తూ ఈ మూవీ ని కంప్లీట్ చేసాడంటే మహేష్ కి సినిమా మీద ఎంత ఫ్యాషన్ ఉందో తెలుస్తుంది.I WISH ALL THE BEST TO ENTIRE TEAM ..సినిమా మంచి సక్సెస్ అయ్య్ ,మహేష్ డ్రీం వర్క్స్ బ్యానర్ నుంచి మరిన్ని మంచి సినిమా లు రావాలని కోరుకుంటున్నాను అన్నారు..

ఈ చిత్రానికి సంగీతం-కళ్యాణ్ కాదిన్,ప్రమోద్ పులిగిళ్ళ,pvrరాజ,PRO -మధు విఆర్,ఎడిటర్;సన్నీ అట్లూరి,స్క్రీన్ ప్లే-సతీష్ బాణాల,సినిమాటోగ్రాపర్;సర్ హెన్రీ చాంగ్,కథా-మాటలు-దర్శకత్వం-మహేష్ చెంగారెడ్డి…