Tollywood: ప‌క్క‌కు త‌ప్పుకోండి‌.. బ‌ర్నింగ్‌స్టార్ బ‌జార్‌రౌడీ వ‌చ్చేసాడు..

Tollywood: బ‌ర్నింగ్‌స్టార్ అంటే ట‌క్కున సంపూర్ణేశ్‌బాబు పేరు చెబుతారు. అంత‌లా ఈ పేరుకు గుర్తింపు ఉంది. బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్‌బాబు హృద‌య‌కాలేయం చిత్రంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మై ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఫిదా చేశారు. తెలుగులో ప‌లు చిత్రాల్లో న‌టించి టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు సంపూ. ఇక ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం బ‌జార్‌రౌడి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంబ‌రాలు ద‌ద్ద‌రిల్లించ‌డానికి ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ చేశారు చిత్ర‌బృందం.

Tollywood కె.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత సందిరెడ్డి శ్రీ‌నివాస‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. Tollywoodసంపూర్ణేశ్ బాబు స‌ర‌స‌న మ‌హేశ్వ‌రి వ‌ద్ది హీరోయిన్‌గా న‌టిస్తోంది. సీనియ‌ర్ ఎడిట‌ర్ గౌతంరాజు ఈ సినిమాకు ఎడిటింగ్‌.. ఎ.విజ‌య్‌కుమార్ సినిమాటోగ్ర‌ఫీ, సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు. Tollywood ఇక ఇటీవ‌లే ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ షూటింగ్ జ‌రిగింది. దీనికి సంబంధించిన కొన్ని స్టిల్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.. దీంట్లో సంపూర్ణేశ్‌బాబు షూట్‌లో గాయ‌ప‌డి.. విశ్రాంతి తీసుకుని తిరిగి షూట్‌లో పాల్గొన్న విష‌యం తెలిసిందే.