‘నాగ చైతన్య’ జోష్ కి 11 ఏళ్ళు.. ‘సమంత’ ఏమంటోందంటే..

జోష్ చిత్రం విడుదలై నేటితో 11 సంవత్సరాలయ్యింది. నాగ చైతన్య అక్కినేని కుటుంబానికి చెందిన మూడవ తరం వారసుడిగా ఈ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. వాసు వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాకి దిల్ రాజు నిర్మాత. జోష్ అంతగా సక్సెస్ కాకపోయినా కూడా నాగ చైతన్యకు హీరోగా ప్రేక్షకులలో మంచి గుర్తింపు లభించింది.

ఇక అతని రెండవ చిత్రం ఏ మాయ చెసావ్ బాక్సాఫీస్ వద్ద మొట్టమొదటి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత, నాగ చైతన్య కొన్ని ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొన్నప్పటికీ వెంటనే మరికొన్ని డిఫరెంట్ సినిమాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. రారండోయ్ వేడుకా చుద్దాం, మాజిలి అతని కెరీర్‌కి మంచి బూస్ట్ ఇచ్చాయి. ఇక నేటితో చైతన్య నటుడిగా తన 11వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడనే చెప్పాలి. ఈ సందర్భంగా అభిమానులు సినీ సెలబ్రెటీలు చాలా మంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భార్య సమంత కూడా ఒక ప్రత్యేకమైన ట్వీట్ చేసింది.

11 ఇయర్స్ఫోర్ జోష్ అంటూ పరిశ్రమలోకి వచ్చి 11 సంవత్సరాలు అయిన సందర్భంగా అక్కినేని చైతన్యకి నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు అని అలాగే రాబోయే నా హీరో సినిమాల కోసం చాలా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. సమంత చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సమంత నాగ చైతన్య కలిసి నాలుగు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. త్వరలోనే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో వారు ఒకటవ్వబోతున్నారు. ఇక ప్రస్తుతం నాగ చైతన్య లవ్ స్టొరీ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత పరశురామ్ దర్శకత్వంలో మరో సినిమాను కూడా స్టార్ట్ చేయనున్నాడు.